సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని ఏలాలని చాలామంది అమ్మాయిలకి ఉంటుంది. అందుకే డైరెక్ట్ గా హీరోయిన్ ఛాన్సులు కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవాళ్ళు కొందరైతే, ఇలా డైరెక్ట్ గా పని అవ్వదని ముందు మోడల్ గా మారీ అందరి దృష్ఠిని ఆకర్షించి అలా ప్లాన్ బి తో హీరోయిన్ గా ఛాన్సులు అందుకునే వాళ్ళు కొందరు. అయితే ఒక్కసారి హీరోయిన్ అని ముద్ర పడితే వీళ్ళకి మామూలుగా ఉండదు. ఇక ఫస్ట్ మూవీ గనక సక్సస్ అయి ఇంకో రెండు  సినిమాలకి సైన్ చేస్తే రేంజ్ ఏంటో చూపిస్తారు. ఒక్క ఛాన్స్ వస్తే బావుండు అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు టాప్ హీరోయిన్ గా స్టార్ డం వస్తే బావుండు అనుకుంటారు.

 

ఆ విధంగానే ప్రయత్నాలు మొదలు పెట్టి దాదాపు సక్సస్ అయిన వాళ్ళు చాలా మంది హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇక వీళ్ళలో కొంతమంది అసలు హీరోయిన్ అవుతానని ఇంత మంది అభిమానులను సంపాదించుకొని సక్సస్ అయిన ఈ రేంజ్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తానని కలలో కూడా అనుకోలేదన్న సమాధానం చెప్పే వాళ్ళు మరొకొందరు. నిజమే ఇక్కడ లక్ ఎప్పుడు ఫేవర్ చేస్తుందో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి అంతా మాయగా జరిగిపోతుంది. అయితే మన హీరోయిన్స్ లో చాలామంది కష్ఠపడి సక్సస్ అయినవాళ్ళే సమంత, అనుష్క, తమన్న, నయనతార, త్రిష ..వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలో ఇంతకాలం కొన సాగుతున్నారంటే దాని వెనక వాళ్ళ కృషి పట్టుదలే ముఖ్య కారణం అని చెప్పాలి.

 

ఇక హీరోయిన్ అవగానే చాలామంది షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి కమిటవుతారు. ఫేం లో ఉన్న హీరోయిన్ తో తమ షాప్ ఓపెన్ చేస్తే లక్ కలిసి వస్తుందనుకునే వ్యాపారవేత్తలు చాలామంది. అందుకే అప్పుడప్పుడే నేం వస్తున్న హీరోయిన్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్  వరకు అందరితో ను తన షాప్ ఓపెంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహా అయితే ఇలా వ్చ్చి రిబ్బన్ కట్ చేసి వెళ్ళే సమయం చాలా కొద్దిసేపే. ఆ కొద్దిసేపటికే లక్షల్లో రెమ్యూనరేషన్ ముట్ట చెబుతారు. కానీ ఇక్కడ హీరోయిన్స్ కి మాత్రం ఆ ఒక్క గంట నరకం కనపడుతుంది. తమ ఫేవరేట్ హీరోయిన్ వస్తుందని తెలుసుకున్న మరుక్షణం జనాలు కుప్పౌ తెప్పలుగా గుము కూడతారు. కారు దిగే అవకాశం కూడా ఇవ్వకుండా చుట్టేస్తారు. కారు దిగి ఎంట్రెన్స్ దగ్గరికి నాలుగు అడుగులు వేయడానికే తల ప్రాణం తోక కొస్తుంది. 

 

అంతగా ఫ్యాన్స్ మీద మీద పడుతుంటారు. ఆ సమయంలో హీరోయిన్స్ పరిస్థితి వర్ణనాతీతం. అందుకే లక్షల్లో రెమ్యూనరేష్న్ ఇచ్చినా ఆ ఒక్క గంట మాత్రం టార్చర్ పడతాము అని ఫీలవుతుంటారు. కానీ ఆ ఒక్క గంట భరిస్తే మాత్రం ఆ తర్వాత పొందే ఆనందం కి మాటలు రావని అంటున్నారు మన స్టార్ హీరోయిన్స్. ఇలా అన్ని భరించి వచ్చే లక్షల రెమ్యూనరేషన్ అనాధ పిల్లలకి, ముసలి వాళ్ళకి లేదా దత్తత తీసుకున్న వాళ్ళకి అవసరాలను తీర్చడానికి ఆ డబ్బును దానం చేస్తారు. అలా చేస్తున్న వాళ్ళలో అక్కినేని సమంత, అనుష్క, రాఘవ లారెన్స్ ముందుంటారు. ఇది నిజంగా మానవత్వం అంటే. 

మరింత సమాచారం తెలుసుకోండి: