మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన నటుడు రామ్ చరణ్. హీరోగా నటించిన తోలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుని మెగా ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అందించిన చరణ్, ఆ తరువాత దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించడం జరిగింది. రెండు జన్మల నేపథ్యంలో మంచి కథాబలంతో పాటు పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో ఎంతో పెద్ద విజయాన్ని అందుకుని పలు రికార్డ్స్ కూడా నమోదు చేసిందో తెలిసిందే. 

 

నిజానికి అప్పటివరకు టాలీవుడ్ లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా రికార్డ్స్ ని కొన్ని కేంద్రాల్లో బద్దలు కొట్టిన మగధీర సినిమా, అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు, రెండవ సినిమాతోనే చరణ్ రికార్డులతో చెడుగుడు ఆడాడు అని చెప్పవచ్చు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మొదటి అర్ధ భాగం కొంత ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి, రెండవ భాగంలో మాత్రం తన అత్యద్భుతమైన టేకింగ్ తో రసవత్తరమైన కథ, కథనాలతో పాటు, పలు యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాని ముందుకు నడపడం జరిగింది. 

 

హర్ష, భైరవ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటించిన చరణ్, రెండిట్లో దేనికదే ఆకట్టుకునే నటన ప్రదర్శించి అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు ప్రేక్షకుల నుండి కూడా మంచి పేరు దక్కించుకున్నాడు. ఇక ఒకప్పుడు మెగాస్టార్ హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ అయిన బంగారు కోడిపెట్ట సాంగ్ ని మగధీరలో రీమిక్స్ చేయగా, ఆ సాంగ్ అప్పట్లో మంచి అప్లాజ్ ని దక్కించుకుంది. ఇక టాలీవుడ్ చరిత్రలోని అతి పెద్ద హిట్ మూవీస్ లో మగధీర కూడా ఒకటి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఇప్పటికే కూడా కొన్ని చోట్ల ఆ సినిమా రికార్డ్స్ ఎంతో పదిలంగా ఉన్నాయని తెలుస్తోంది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: