టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి తన పెదనాన్న కృష్ణంరాజు నట వారసత్వంతో అడుగుపెట్టిన నటుడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆయన నటించిన తొలి సినిమా అయిన ఈశ్వర్ మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తరువాత నటించిన రాఘవేంద్ర పర్వాలేదనిపించగా ఆపై వచ్చిన వర్షం సినిమా, అతి పెద్ద విజయాన్ని అందుకుని ప్రభాస్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించింది. ఇక తరువాత వరుసగా అవకాశాలు అందుకున్న ప్రభాస్, అనంతరం రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఛత్రపతి సినిమాతో మంచి మాస్ హిట్ ని అందుకున్నారు. 

 

ఇక ఆ తరువాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో మంచి క్లాస్ హిట్స్ అందుకున్న ప్రభాస్, అదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో హీరోగా నటించారు. అప్పటివరకు పలు సినిమాలకు కథలు అందించిన కొరటాల, మిర్చి తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యారు. శత్రువుని ఎవడైనా కొడతాడు, చంపుతాడు, కానీ మంచి మనసుతో శత్రువుని ప్రేమించి ఆదరించే మనస్తత్వం మాత్రం ఎక్కడో నూటికో కోటికో ఒక్కరికి ఉంటుంది. ఇక ఈ సినిమాలో అదే పాయింట్ ని ఎంచుకున్న కొరటాల, దానికి పలు కమర్షియల్ హంగులు జోడించి ఎంతో అద్భుతంగా సినిమాని తీశారు. 

 

ఇక అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి ప్రభాస్ యొక్క క్రేజ్, మార్కెట్ ని విపరీతంగా పెంచడంతో పాటు, బాక్సాఫీస్ ని రై రై అంటూ ఒక్కసారిగా పరుగెత్తించింది. క్లాస్, మాస్, యూత్, లేడీస్, ఇలా అన్నివర్గాల వారు ఆ సినిమా చూడడానికి అప్పట్లో క్యూకట్టారు. ఇంక ఆ తరువాత ప్రభాస్ నటించిన బాహుబలి రెండు సినిమాలు రిలీజ్ అయి అతి పెద్ద విజయాలు అందుకున్నప్పటికీ, అంతకముందు వచ్చిన మిర్చి సినిమా మాత్రం ప్రభాస్ కెరీర్ లో అతి పెద్ద సెన్సేషన్ అని చెప్పకతప్పదు. అది మరి రెబల్ స్టార్ దెబ్బంటే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: