సూపర్ స్టార్ మహేష్ బాబు.. అయన ఎందరో అమ్మాయిలకు కలలు రాజకుమారుడు. ఎందరికో రోల్ మోడల్. అద్భుతమైన నటుడు.. తండ్రి సూపర్ స్టార్ కృష్ణను మించిన కొడుకు.. ప్రిన్స్ గా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సూపర్ హిట్ సినిమాలు తీసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు.. 

 

తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాడు.. అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు తీసే చిత్రాల గురించి ప్రస్తుతం మాట్లాడితే.. అయన సినిమాలు అన్ని కూడా మిగితా హీరోల సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే.. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు తీసే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది.. 

 

ఆ మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. శ్రీమంతుడు సినిమా.. 2015లో వచ్చింది.. ఈ సినిమా ఎంత అద్భుతమో తెలుసా? ఆ సినిమాలో మహేష్ బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాడు.. డబ్బు ఉంటె గ్రామాన్ని దత్తత తీసుకొని ఇలా అభివృద్ధి చెయ్యండి.. సొంత ఊరిని అబివృద్ది చెయ్యండి అని మెసెజ్ ఇచ్చాడు. 

 

ఆ తర్వాత మహర్షి.. 40 గ్రామాల కొసం సినిమా తీసి.. వ్యవసాయంకు ఎంత విలువ ఉందొ చెప్పాడు.. వ్యవసాయం లేకపోతే మనిషికి తిండి ఉండదు అని ఈ సినిమా ద్వారా అర్థం అయ్యేలా చెప్పాడు. వ్యవసాయంపై ప్రజలకు ప్రేమ పుట్టించాడు. ఇంకా అది కట్ చేస్తే.. ఈ సినిమా మహర్షి కంటే ముందే వచ్చిన కంటెంట్ లో నీట్ గా ఉండాలి అని అది ముందు రాసేశాము. 

 

ఇంకా ఆ తర్వాత చిత్రం.. భరత్ అనే నేను.. ఈ సినిమా ఒక రాష్ట్రం కోసం తీశాడు. ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు.. రాజకీయనాయకులు ఎంత నీచానికి దిగజారుతున్నారు.. సీఎం అంటే ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించి ప్రజలకు ఒక మంచి సీఎం ఎవరు అనేది చూపించాడు.. ఇప్పుడు ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరూ సినిమా ఒక దేశం కోసం తీసి.. భారత సైనికుల విలువ.. వారు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది కంటికి కట్టినట్టు చూపించి ప్రజలకు మరింత దగ్గర అయ్యాడు మహేష్ బాబు. ఇలా మహేష్ బాబు తీసిన ప్రతి సినిమాలో ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు. ఇంతకంటే గొప్ప హీరో మరెవరైనా ఉంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి: