మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ లో రాం చరణ్ తో పాటుగా మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. తీసేది కమర్షియల్ సినిమాలే కాని అందులో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే కొరటాల శివ చిరు సినిమా కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ, చిరంజీవి మూవీ అనగానే ఈ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా కథ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలోని అవకతవకల గురించి తన మార్క్ లో చూపిస్తాడని తెలుస్తుంది.

 

ఇదిలాఉంటే కొరటాల శివ కదా కేవలం సోషల్ మెసేజ్ మాత్రమే ఉంటుందని అనుకుంటే పొరపాటే. చిరు నుండి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉండేలా చూస్తున్నారట. మెగాస్టార్ మార్క్ మెగా డ్యాన్స్ అదిరిపోయే స్టెప్పులు, కామెడీ, డైలాగ్స్ ఇలా అన్నిటిలో మెగా ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించేలా ఈ సినిమా ఉంటుందని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా కోసం ఓ విలేజ్ తో పాటుగా టెంపుల్ సెట్ వేశారని తెలుస్తుంది. సినిమాను 90 రోజుల్లో పూర్తి చేయాలని కొరటాల శివకు డెడ్ లైన్ కూడా పెట్టాడట మెగాస్టార్ చిరంజీవి.

 

మొత్తానికి ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు సైరా సినిమాలో డిఫరెంట్ ఎక్స్ పరమెంట్ చేయగా మళ్లీ కొరటాల శివ సినిమాతో మాత్రం ఫ్యాన్స్ అందరిని అలరించే ప్రయత్నమే చేస్తున్నాడు. సినిమాలో చిరు డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని టాక్. త్రిష మెయిన్ లీడ్ కాగా సెకండ్ హీరోయిన్ గా ఎవరన్నది ఇంకా తెలియలేదు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: