టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ తో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు తారక్. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ గట్టిగానే కష్టపడుతున్నాడు. భారీ మల్టీ స్టారర్ కావడం, దాదాపు రెండేళ్ళ తర్వాత సినిమా వస్తుండటంతో తారక్ మరో సినిమా ఆలోచన లేకుండా ఇదే చేస్తున్నాడు. 

 

సినిమా తర్వాత తారక్ చేసే సినిమాపై ఇప్పటి నుంచే ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. తనకు అరవింద సమేత సినిమాతో బిగ్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తో కలిసి తన తర్వాతి ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు తారక్ తో సినిమా కోసం నిర్మాణ సంస్థల మధ్య పోటీ ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జూనియర్ ఎన్టీఆర్ తన అన్నతో సినిమా చెయ్యాల్సి ఉంది. జైలవకుశ సినిమా తర్వాత తన అన్నకు మాట ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు ఉండటం తో చేయలేకపోయాడు. 

 

ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుకున్నాడు. దీనితో కళ్యాణ్ రామ్ సినిమా వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమాలు అన్నీ హారిక అండ్ హాసిని బ్యానర్ పైనే ఉంటాయి కాబట్టి... ఆ సినిమాకు అవకాశం లేకపోయింది. దీనితో ఇప్పుడు ఒక ప్రతిపాదన పెట్టాడు తారక్, త్రివిక్రమ్ సినిమాను హారిక అండ్ హాసిని, కళ్యాణ్ రామ్ తో కలిసి చెయ్యాలి అని. కాని అందుకు కళ్యాణ్ రామ్ అంగీకరించలేదు అని తెలుస్తుంది. తాను సినిమా చేస్తే ఒక్కడినే చేస్తాను గాని ఇలా చేయను అని చెప్పేశాడట కళ్యాణ్ రామ్. దీనితో ఎన్టీఆర్ ఎవరితో చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: