టాలీవుడ్ లో రానా చేసే సినిమాలకు ఎప్పుడు కూడా ఒక క్రేజ్ ఉంటుంది. తన తండ్రి స్టార్ నిర్మాత అయినా సరే రానా విభిన్న కథల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దగా సినిమాలు చేయకపోయినా చేసిన సినిమా మాత్రం క్వాలిటీ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇక హీరో పాత్ర అయినా విలన్ పాత్ర అయినా సరే రానా వెనుకాడే పరిస్థితి ఉండదు. తనకు ఉన్న స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి మరీ సినిమాలు చేసి అందరిని ఆకట్టుకుంటాడు. దీనితో విభిన్నంగా సినిమాలు చెయ్యాలి అనుకున్న దర్శక నిర్మాతలు రానాని కాంటాక్ట్ అవుతారు.

 

ఇక ఇప్పుడు రానా మెయిన్ రోల్ చేస్తున్న చిత్రం అరణ్య. మూడు భాషల్లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రభు సోలోమన్ తెరకెక్కిస్తున్నారు. అరణ్య సినిమా హిందీ లో హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. అడవి తల్లి ని నమ్ముకుని ఉన్న ఒక ఆదివాసి కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. తను ఉండే అడవికి ఆపద వస్తే ఎం చేస్తాడు అనే దాన్ని ఆధారంగా రూపొందించారు. 

 

టీజర్ యుట్యూబ్ లో కూడా మంచి ఆదరణ పొందింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి  ‘ఫ్రమ్‌ ఎ సూపర్‌స్టార్‌ టు ఎ ఫారెస్ట్‌ మ్యాన్‌’ పేరుతో ఒక మేకింగ్‌ వీడియోను ఈ సినిమా యూనిట్ యుట్యూబ్ లో విడుదల చేసింది. అడవిలో బతికే ఒక ఆదివాసిగా రానా మారిన తీరు, తాను ఏనుగులను మచ్చిక చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది. అడవి మనిషిలా రానా అరుపులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: