ఎవరు ఎన్ని చెప్పినా సరే ఫ్యాన్స్ నందు  ఫ్యాన్స్  వేరు. వాళ్ళ స్టైల్ వేరు వాళ్ళ ఆలోచన వేరు. బహుసా అలాంటి అభిమానులు టాలీవుడ్ లో ఏ హీరో కి లేరు. చిరంజీవిని అన్నయ్య అన్నయ్య అంటూ పవన్ కి దూరం గా ఉన్నారని నోటికి వచ్చినట్టు మాట్లాడినా వాళ్ళకే చెల్లింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయింది అని త్రివిక్రమ్ ని కులాలతో కలిపి తిట్టినా వాళ్ళకే చెల్లింది. పవన్ కళ్యాణ్ ని నడిచే దైవంగా చూస్తారు మరి వాళ్ళు. ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటారు చెప్పండి. 

 

ఇప్పుడు అది పక్కన పెడితే ఇక పవన్ ఫాన్స్ సినిమాలు చూడాలి అంటే ఆయన్ను కచ్చితంగా ఎవరో ఒకరు పొగడాల్సిన అవసరం ఉంది. అందుకే సైలెంట్ గా త్రివిక్రమ్ వెళ్లి అల్లు అర్జున్ తో చేసిన సినిమాకు ముందు పవన్ ని కలిసాడు. ఆ తర్వాత పవన్ కూడా అల్లు అర్జున్ కి అభినందనలు చెప్పాడు. ఇప్పుడు రష్మిక మంధన విషయానికి వస్తే తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. 

 

నితిన్ ఎంత ఎదిగినా పవన్ ఫ్యాన్ అని చెప్పింది. మాటల మధ్యలో నితిన్ తాను పవన్ ఫ్యాన్ అని చెప్పాడు అని చెప్పింది. నితిన్ ని ఈమె అడిగింద౦ట, మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ని కలిసారా అంటే పవన్ ని రెండు మూడు సార్లు కలిసా అని చెప్పాడు అంట నితిన్. నితిన్ పవన్ తో ఒక సినిమా కూడా చేసాడు. చివరికి పవన్ ఫాన్స్ ని బుట్టలో వేయడానికి రష్మిక కూడా ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్ ని ఈ విధంగా వాడుకుంటున్నారు పాపం అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: