బాలీవుడ్ హీరోయిన్లు ప్రేమలో పడటం కొత్త ఏమీ కాదు. వరుసగా ఎవరితో ఒకరితో ప్రేమలో పడుతూనే ఉంటారు. మాట మీద ఉండరో లేక ఇంకేదైనా కారణమో తెలియదు గాని వాళ్ళు ఎక్కువగా ప్రేమ వ్యవహారాలను నడుపుతూ ఉంటారు. ఎవరిని ప్రేమిస్తారో ఎవరిని పెళ్లి చేసుకుంటారో వాళ్ళకే అర్ధం కాని పరిస్థితి. మూడు పదుల వయసు దాటి సినిమాలు చేస్తూ ఉన్న హీరోయిన్లు కూడా ఇలాగే ఉన్నారు ప్రస్తుతం. దీపిక పదుకొనే, ప్రియాంకా చోప్రా, ఐశ్వర్య రాయ్ ఇలా ముగ్గురు నలుగురితో ప్రేమలో ఉండి చివరికి ఎవరినో పెళ్లి చేసుకున్నారు. 

 

ఇక వారితో సమానంగా ఉండే స్టార్ హీరోయిన్ కత్రినా అయితే చాలా మందితో లవ్ స్టోరీస్ నడిపింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, క్రికెటర్లు ఇలా చాలానే లవ్ స్టోరీస్ ఉన్నాయి ఆమెకు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఎవరితోనో డేటింగ్ చేస్తుంది. ఆమె ఊరి చిత్రంలో నటించి మెప్పించిన విక్కీ కౌశల్ తో లవ్ లో ఉన్నారని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఒక ఇంగ్లీష్ మీడియా ఆయన్నే ప్రశ్నించింది. దీనికి కాస్త ఆసక్తికరంగా వింతగా సమాధానం చెప్పాడు విక్కీ. 

 

కత్రినాతో మీరు డేటింగ్‌లో ఉన్నారా? అంటూ విలేఖరి ఆయన్ను ప్రశ్నించగా... నిజం చెప్పాలంటే తన జీవితాని కి సంబంధించిన కొన్ని విషయాలను మాత్రమే తాను బయటపెడతాను అన్నాడు. కొన్ని వ్యక్తిగత విషయాలను బయటపెట్టడానికి తాను ఇష్టపడను అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా... ఎందుకంటే ఒకవేళ నేను అన్ని విషయాలను బయటపెడితే కొందరు వ్యక్తులు వాటి గురించి చర్చలు పెడతారని, మరికొందరు తన జీవితం గురించి తప్పుగా మాట్లాడతారని, తనకు అలా ఇష్టం ఉండదన్నాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అందరికీ చెప్పాలనుకోవడం లేదని, దీనిని మీరు గౌరవిస్తారనుకుంటున్నాని విక్కీ స్పష్టంగా చెప్పాడు. ఇంతకు ప్రేమలో ఉన్నాడో లేదో తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: