అవయవ లోపం ఉన్న వాళ్ళకి ఆ భవగవంతుడు ఆ లోపానికి నాలుగింతల తెలివి తేటలు బ్రేయిన్ లో ఇస్తాడంటారు. అంటే కాలు, చెయ్యి, కన్ను ..ఇలా శరీరంలో ఏదైనా ఒక పార్ట్ పనిచేయకపోతే ఆ లోపాన్ని భర్తీ చేస్తాడని ఎంతో మంది చెబుతుంటారు. అది ఇప్పుడు అక్షరాలా నిజమని ప్రూవ్ అయింది. తమిళ బుల్లి తెరపై ‘కోటీశ్వరి’ అనే ఒక మహిళల గేమ్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి గేం షో అనమాట. కలర్స్ ఛానల్ లో ప్రసారం అయ్యే ఆ గేమ్ షోకు సీనియర్ హీరోయిన్ రాధిక హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ గేమ్ షో మహిళలకు మాత్రమే. ఈ గేమ్ షో తో రాధిక చాలా ఫేమస్ అవ్వడంతో పాటు ఎంతో మంది మహిళల జీవితాలు వారి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తోంది. 

 

దాంతో కోలీవుడ్ లో ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ దక్కుతుంది. తాజాగా ఈ గేమ్ షోలో కౌసల్య కార్తీక కోటి రూపాయలు దక్కించుకుంది. ఇంతకు ముందు కూడా ఈ గేమ్ షో లో కోటి రూపాయలు గెలుచుకున్నారు ఉన్నారు. కాని కౌసల్య కార్తీక చాలా చాలా స్పెషల్. ప్రపంచంలోనే మొదటి సారి ఇలాంటి గేమ్ షో లో గెలిచిన మహిళగా కౌసల్య నిలిచింది. కోటి రూపాయలు గెలిచిన కౌసల్య ఇతరుల మాటలను వినలేదు.. ఇతరులతో తాను అనుకున్నది చెప్పలేదు.  మూగ, చెవిటి అమ్మాయి కౌసల్య. తన ప్రతిభతో అద్బుతమైన మేదస్సుతో కోటి రూపాయలు దక్కించుకుంది. 

 

చిన్నప్పుడే మాట.. వినికిడి శక్తిని కోల్పోయినా కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుకుంది. ఆమెకు స్నేహితులు కూడా సపోర్ట్ గా నిలవడంతో పాటు అమ్మ ఇంట్లో టీచర్ గా మారి ఆమెకు అర్థం అయ్యేలా పెదాలు కదిలిస్తూ పాఠాలు చెప్పేదట. పదవ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత కౌసల్య బీఎస్సీ.. ఎంబీఏ కూడా టాప్ లో నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగంను కూడా సంపాదించిన కౌసల్య రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఏడాది బాబు కూడా ఉన్నాడు. బాబు మాటలు వినలేక పోతున్నాను అనే భాధ ఆమెకు ఉన్నా కూడా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు.

 

ఒక రోజు పేపర్ లో కోటీశ్వరి గేమ్ షో గురించి యాడ్ చూసిన కౌసల్యకు ఆసక్తి కలిగింది. తనలాంటి వారికి అవకాశం ఉంటుందో లేదో అనుకుంటూ అప్లై అయితే చేసిందట. బదిర మహిళ నుండి అప్లికేషన్ రావడంతో షో నిర్వాహకులు కూడా ఆసక్తి చూపించారు. ఆమెకు ప్రత్యేకంగా రూల్స్ మార్చి ఆమెను షోలోకి తీసుకు వచ్చారు. అయితే ఆమె కోటి రూపాయలు గెలుస్తుందని ఎవరూ హించలేదు. రాధిక అడిగిన ప్రశ్నలకు ఒక బోర్డు మీద రాసి చూపిస్తూ సమాధానం ఇచ్చింది. ప్రశ్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరచాయి. మాటలు రాకపోయినప్పటికి.. ఇతరుల మాటలు వినలేకపోయినప్పటికి కౌసల్య తన గురించిమ మాట్లాడుకునేలా.. గొప్ప పేరును సాధించింది. అంతేకాదు ఇలాంటి ఎంతో మందికే కాదు అన్ని ఉన్నా జీవితం అంటే లెక్కలేని వాళ్ళకి ఆదర్శంగా నిలిచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: