తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్న కమర్షియల్ సక్సస్ ‘భీష్మ’ మూవీతో వస్తుందని నితిన్ ఎన్నో ఆశల పై ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఎవరు ఊహించని విధంగా ‘భీష్మ’ టైటిల్ పై తీవ్ర విమర్శలు రావడం హాట్ న్యూస్ గా మారింది. 


ఆ మధ్య విడుదలైన ‘వాల్మీకి’ మూవీ టైటిల్ తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంది అంటూ బోయ సామాజిక వర్గం పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ మూవీకి చివరి నిముషంలో ‘గద్దలకొండ గణేష్’ అన్న టైటిల్ తో విడుదల చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ‘భీష్మ’ విషయంలో కూడ జరుగుతోంది.  


ఆజన్మబ్రహ్మచారి అయిన భీష్ముడి పేరును ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ కుఎలా పెడతారు అంటూ కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియాలో హడావిడి చేస్తున్నారు. వాస్తవంగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వ్యక్తిని బ్రహ్మచారి అంటారు కాని మహాభారత యుద్ధాన్ని నడిపించిన భీష్ముడు తో ఒక సినిమా పాత్రను పోలుస్తూ ఎంతో పవిత్రంగా భావించే మహాభారత కథకు అవమానం కలిగిస్తున్నారు అంటూ ఒక కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. వీరి వాదన ప్రకారం సినిమాలు తీయాలి అంటే రాముడు కృష్ణుడు అరుంధతి సీత పేర్లతో ఇక ఎవరు సినిమాలు తీయలేరు. శ్రీరామ చికెన్ సెంటర్ శ్రీ వెంకటేశ్వర బార్ అంటూ వ్యాపారాల బోర్డుల పై లేని అభ్యంతరాలు సినిమా టైటిల్స్ పై వస్తే భవిష్యత్ లో ఇక సినిమాలకు టైటిల్స్ పెట్టడమే కష్టంగా మారిపోతుంది. 


ఏ విషయంలోనూ దెబ్బ తినని ప్రజలు మనోభావాలు సినిమాల టైటిల్స్ విషయంలో దెబ్బ తిన్నాయి అంటూ కోర్టులకు ఎక్కడం మీడియాకు ప్రకటనలు ఇవ్వడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. వాస్తవానికి మహాభారతం లోని భీష్ముడు కథకు ఈ వారం విడుదల కాబోతున్న ‘భీష్మ’ సినిమాకు ఏమాత్రం పోలిక లేదు అన్న విషయం చెపుతున్నా కొందరు వ్యక్తులు కొన్ని సంస్థలు ఈ సినిమాను టార్గెట్ చేస్తూ తెర పైకి తీసుకు వస్తున్న ఈ నెగిటివ్ ప్రచారం నితిన్ దృష్టి వరకు రావడంతో పాజిటివ్ టాక్ ఉన్న ఈ మూవీకి ఈ నెగిటివ్ ప్రచారం ఏమిటి అంటూ కలవర పడుతున్నట్లు సమాచారం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: