సాధారణంగా సినిమా ఫంక్షన్స్ లో హీరోయిన్స్ అంతగా మాట్లాడరు. అయితే దీనికి భిన్నంగా నిన్న జరిగిన ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదిక పైకి వచ్చి రష్మిక సుమారు 7 నిముషాలు మాట్లాడటం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఈ ఫంక్షన్ కు వచ్చి ముందు వరసలో కూర్చున్న ప్రతి వ్యక్తిని పేరు పేరున పలకరిస్తూ కొనసాగిన రష్మిక ఉపన్యాసం వినేవారికి బాగుంటే నటుడు బ్రహ్మాజీకి మాత్రం నిద్రను తెప్పించింది. 


సుధీర్ఘంగా సాగుతున్న రష్మిక ఉపన్యాసం తట్టుకోలేక బ్రహ్మాజీ దర్శకుడు వెంకీ కుడుముల తోడ పై పొడుకుని నిద్ర పోయినట్లుగా నటించడం మీడియా కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఇక రష్మిక తన ఉపన్యాసంలో తనకు అవకాశాలు ఇమ్మని అడుగుతూ దిల్ రాజ్ ను అదేవిధంగా దర్శకుడు త్రివిక్రమ్ ను ఓపెన్ గా అభ్యర్ధించడంతో రష్మిక లాంటి క్రేజీ హీరోయిన్స్ కూడ అవకాశాల కోసం ఏవిధంగా అవస్థలు పడుతున్నారు అన్న విషయం అర్ధం అవుతుంది.


హీరోలు కూడ స్పష్టంగా తెలుగు మాట్లాడలేకపోతున్న పరిస్థితులలో రష్మిక చాల స్పష్టంగా అనర్గళంగా 7 నిముషాలు తెలుగులో మాట్లాడటం చూసి యాంకర్ సుమ రష్మిక తెలివి తేటలకు షాక్ అయింది. ఈ ఫంక్షన్ ప్రారంభం అయిన దగ్గర నుండి ఎవరో ఒకరితో మాట్లాడుతూ సందడి చేసిన రష్మికఈవెంట్ కు హైలెట్ గా మారింది. 


‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో తాను ఆశించిన క్రేజ్ రష్మిక కు రాకపోయినా ఈ వారం విడుదల కాబోతున్న ‘భీష్మ’ మూవీతో రష్మిక కోరుకున్న క్రేజ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మూవీ అనుకున్న విధంగా హిట్ అయితే ఈ ఏడాది వరసగా రెండవ విజయాన్ని అందుకున్న హీరోయిన్ గా రష్మిక మారిపోయి ఆమె డిమాండ్ పెరగడమే కాకుండా ఆమె పారితోషికం కూడ మరింత పెరిగి ఆమె డేట్స్ కు తగ్గట్టుగా టాప్ యంగ్ హీరోలు తమ డేట్స్ ఇచ్చే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: