అదేంటీ షారూక్ మరణం.. రాజ్ కపూర్ ఇంట విషాదం అనగానే అశ్చర్యపోతున్నారా.  ఇంత పెద్ద మ్యాటర్ ఇంత సింపుల్ గా చెబుతున్నారా అనుకుంటున్నారా.. ? ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. షారుక్ హఠాన్మరణంతో రాజ్ కపూర్ కపూర్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొన్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.  అయితే అసలు విషయానికి వస్తే.. చనిపోయింది షారూక్.. నిజంగానే రాజ్ కపూర్ ఇంట విషాదం నెలకొంది.  కాకపోతే ఇది బాలీవుడ్ లో మాత్రం కాదు.. కోలీవుడ్. 

 

'తాలాట్టు కేట్కుదమ్మా' అనే సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తమిళ సినీ పరిశ్రమంలో బిజీ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు రాజ్ కపూర్.  ఆ మద్య రాజ్ కపూర్ దర్శకత్వంలో తల అజిత్ కుమార్ అవర్‌ వరువాళా చిత్రంలో నటించాడు.  ఈ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  అయితే రాజ్ కపూర్ సినీ రంగంలో ఉండటంతో ఆయన తనయుడు షారూక్ సైతం చిన్ననాటి నుంచి సినిమాలపై ఎక్కువగా మోజు పెంచుకున్నాడు.  తన కొడుకును కూడా మంచి హీరోగా చేయాలని ఎన్నో కలలు కన్నారు రాజ్ కపూర్.  కానీ   గత ఏడాది నుంచి ఆయన కుమారుడు షారుక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  

 

ఇటీవల షారుక్ ఆరోగ్య పరిస్థితి  పూర్తిగా విషమించింది.  ఆసుపత్రిలో అతన్ని బతికించడానికి డాక్లర్టు శాయశక్తులా ప్రయత్నాలు కొనసాగించారు. కొన్ని గంటలపాటు వైద్యులు అతన్ని బ్రతికించేందుకు శ్రమించినప్పటికీ లాభం లేకపోయింది. 21 ఏళ్ల షారుక్ తుది శ్వాస విడిచిపెట్టారు. షారుక్ తుది శ్వాస విడిచినట్లు తెలియగానే ఒక్కసారిగా తమిళనాట షాకింగ్ న్యూస్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  తన తనయుడు చిన్న తనం  నుంచి హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్నప్పటీకీ విధి వక్రించి తమ కలలు కన్నీరు పాలు చేశాడని రాజ్ కపూర్ ఇంట తీవ్ర విశాదం నెలకొన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: