టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా తో కొత్త ట్రెండ్ సృష్టించి యూత్ అందరిని తనవైపు తిప్పుకొని స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. తన ఆటిట్యూడ్ మాటలతో కూడా ఎంతో మందిని ఆకర్షించాడు. అయితే ఒకప్పుడు సంచలన విజయాలను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ గత కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. నోటా డియర్  కామ్రేడ్ లాంటి ఫ్లాప్ లతో విజయ్ క్రేజ్ కొంచం కొంచం గా తగ్గుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్స్ నటించారు. ఇక ఈ సినిమాలో లిప్ లాక్ సీన్లు కూడా ఎక్కువగానే ఉండటంతో ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెంచుకున్నారు. 

 

 

 అయితే ఈ సినిమా విడుదలై మొదటి నుంచే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది... అయినప్పటికీ ఈ రోజుల్లో నెగిటివ్ టాక్ వచ్చినా సక్సెస్ మీట్లు అంటూ ఓ విధంగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విషయంలో  మాత్రం అలా జరగడం లేదు. ఈ సినిమా విడుదలై  మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం మీడియా ముందు కనిపించింది లేదు. కాగా వచ్చే వారం ముంబైలో విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ చిత్రం షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఇక ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిరాశపరచడంతో ఏ మాత్రం లేట్ చేయకుండా పూరి ఫైటర్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 

 

 

 అయితే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం దర్శకనిర్మాతలు ప్రమోషన్ చేసేందుకు విజయ్ ని  సంప్రదించగా... ఇంకా ప్రమోషన్స్ ఎందుకు డబ్బులు దండగా అన్నాడట. ఫ్లాప్ అయినా సినిమాకు పబ్లిసిటీ చేయడం అనేది అవివేకం ఇంకా డబ్బులు వృధా చేసుకోవడం ఎందుకు అని విజయ్ దేవరకొండ నిర్మాతలకు సూచించాడట. దీంతో ఆటో నిర్మాతలు కూడా సైలెంట్ అయిపోయారని  సమాచారం. ఇక టీవీ లో కూడా ఈ చిత్రం భూములను కూడా తగ్గించారు. ఏదేమైనా ఈ సినిమాతో విజయ్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: