స్టార్ హీరోలతో సినిమా అంటే మామూలు విషయం కాదు. కథ నుంచి కాస్టింగ్‌, మేకింగ్ వరకు అన్ని భారీ స్థాయిలో ఉండాలి. అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ను కేటాయించాలి. అందుకే స్టార్ హీరోతో సినిమా అంటే నిర్మాతలకు క్షణ క్షణం భారంగా గడుస్తుంది. ఈ మధ్య కాలంలో నిర్మాతల పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో నిర్మాతలే కథతో పాటు నటీనటులు ఇతర విషయాలపై తుది నిర్ణయం తీసుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హీరోలు ఏది చేపితే అదే ఫైనల్‌ అన్న స్థాయికి వచ్చేసింది ఇండస్ట్రీ.

 

కాస్త పెద్ద బ్యానర్‌లు, సీనియర్‌ నిర్మాతల పరిస్థితి పరవాలేదనిపించినా చిన్న నిర్మాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. హీరో ఏది చెపితే దానికి తల ఊపాల్సిన పరిస్థితి వాళ్లది. దీంతో కళ్లు మూసుకొని ఖర్చు పెట్టడం వల్ల చాలా మంది నిర్మాతలు నష్టపోతున్నారు. అయితే నిర్మాతలకు ఎంత నష్టాలు వచ్చిన కొంత మంది హీరోలు తమ పారితోషికం విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్మాత పరిస్థితిని అర్ధం చేసేకోకుండా పారితోషికం డిమాండ్ చేస్తున్నారట హీరోలు.

 

తాజాగా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా విషయంలోనే అదే జరిగిందట. ఒక్కప్పుడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసిన క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదురకావటంతో కొంత కాలం నిర్మాణ రంగానికి దూరమైంది. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ సీనియర్‌ నిర్మాత వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాను నిర్మించాడు. అయితే సినిమా రిలీజ్‌కు ముందు హీరో విజయ్‌ దేవరకొండ రెమ్యూనరేషన్‌ పూర్తి ఇచ్చేందుకు తన కుటుంబ ఆస్తిని అమ్మాల్సి వచ్చిందట. విజయ్‌ మాత్రమే కాదు గతంలో చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు కూడా నిర్మాతలను రెమ్యూనరేషన్‌ విషయంలో ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: