టాలీవుడ్ లో స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల్లో నాని, రాజ్ తరుణ్ అని చెప్పొచ్చు.  ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కష్టపడి తమ నటనతో అభిమానం సంపాదించారు ఈ ఇద్దరు హీరోలు.  అంతే కాదు ఈ ఇద్దరు కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పరిచయం అయ్యారు.. రాజ్ తరుణ్ అయితే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారు.  ఉయ్యాల జంపాల సినిమతో హీరోగా పరిచయం అయి తరువాత వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇక ప్రముఖ దర్శకులు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని ‘అష్టాచమ్మ’ సినిమాతో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు.  

 

భలే భలే మగాడివోయ్ సినిమాతో వరుస విజయాలు అందుకుంటున్నాడు.  గత ఏడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న నాని ఇప్పుడు ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకప్పుడు మాస్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ నటిస్తున్న సినిమాల విషయంలో తేడాలు వస్తున్నాయి.  లవర్ సినిమా తర్వాత  'ఇద్దరి లోకం ఒకటే' కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. కొంత కాలంగా వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు రాజ్ తరుణ్.  ఆయన తాజా మూవీ 'ఒరేయ్ బుజ్జిగా' సిద్ధమవుతోంది. 

 

విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమాను 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలారు.  ఇక నాని-సుధీర్ బాబు మల్టీస్టారర్ మూవీగా  'వి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పండగు సందర్భంగా నాని, రాజ్ తరుణ్ సినిమాలు రిలీజ్ కావడం ఫ్యాన్స్ కి ఆనందంగా ఉన్నా.. నానిపై పోటీలో రాజ్ తరుణ్ ఎంతవరకూ నెగ్గుకొస్తాడో చూడాలీ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: