పవన్ కళ్యాణ్ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడిన మాటలు పవన్ పొలిటికల్ కెరియర్ కు శాపంగా మారుతాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. 


అటువంటి రికార్డును మళ్ళీ క్రియేట్ చేద్దామని గతంలో చిరంజీవి లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ప్రయత్నించి ఘోరంగా విఫలం అయ్యారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ ఒక ఆసక్తికర కామెంట్ చేసాడు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారని కానీ ఆ ఘనతను ఇప్పుడు ఇంకెవరూ పునరావృతం చేయలేరని పవన్ స్పష్టం చేశాడు. 


ఆ రోజులలో రాజకీయ వాతావరణం భిన్నంగా ఉండేదని క్లారిటీ ఇస్తూ అప్పటి రాజకీయ శూన్యత చైతన్యం ఎన్టీఆర్‌కు ఉపయోగపడిందని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని పవన్ అభిప్రాయ పడుతున్నాడు. ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చే వారందరికీ అత్యాశ స్వార్థం పెరిగిపోయాయని కామెంట్స్ చేస్తూ ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం అంటూ పవన్ అభిప్రాయ పడుతున్నాడు. 


అంతేకాదు వాస్తవానికి ‘జనసేన’ పార్టీ ఓడిపోయిందని తాను భావించడం లేదు అంటూ తమ పార్టీకి పడ్డ ప్రతి ఓటూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మార్పు కోసం జనాలు వేసిన ఓట్లు అని పవన్ అంటున్నాడు. రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తూ పవన్ చేసిన ఈ కామెంట్స్ విన్నవారు మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ కు కలిసి వచ్చిన పరిస్థితులు ఇప్పుడు లేవు అంటూ పవన్ చేసిన కామెంట్స్ రజినీకాంత్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవా లేదంటే తాను ఎందుకు ఫెయిల్ అయ్యాను అన్న విషయం పై క్లారిటీ ఇవ్వడానికా అనే ప్రశ్నలు వస్తున్నా ప్రస్తుతం రాజకీయ శూన్యత లేదు అంటూ పవన్ చేసిన కామెంట్స్ తనకు తానే డిఫెన్స్ లో పడేసుకునే విధంగా ఉన్నాయి అంటూ పవన్ అభిమానులు కూడ భావిస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: