ఈ మద్య కాలంలో సినీ పరిశ్రమంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీ, నటులు కాలం చేస్తున్నారు. అంతే కాదు సినీ రంగంలో ఇతర విభాగాల్లో చేస్తున్న వారు మరణించడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోతుంది. తాజాగా ప్రముఖ బెంగాలీ నటుడు, మాజీ ఎంపీ తపస్‌ పాల్‌(61) గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తపస్‌ పాల్‌ ఈ ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గతంలో రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్‌ను  సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  సిబిఐ అదికారులు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

 

రోజ్‌వ్యాలీ కంపెనీలలో ఒకదానికి డైరెక్టర్‌గా నియామకం గురించి, ఆ సంస్థ బెంగాల్ సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టారంటూ ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.  ఇదిలా ఉంటే ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  తపస్‌ పాల్‌ భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు.  సోమవారం తపస్‌పాల్‌ తన కుమార్తెను చూడటానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు.. విమానాశ్రయంలో ఛాతిలో నొప్పి వస్తోందని సిబ్బందికి తెలిపారు.  

 

వెంటనే ఆయనను జుహులోని ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవ శాత్తు తపస్‌ పాల్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.  గతంలో కూడా ఆయనకు పలు మార్లు గుండె పోటు వచ్చిందని.. ఆ విషయంలో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. కానీ  కొన్ని రోజులుగా అయన గుండె జబ్బుకు చికిత్స తీసుకుంటున్నారు.  ఆయన మృతి పట్ల బెంగాల్ సినీ పరిశ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: