దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2021న విడుదల చేస్తామని రాజమౌళి ఇప్ప‌టికే ప్రకటించాడు. ఈసినిమాను 1920 నేపథ్యంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవితాలను ప్రేరణగా తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాట్టు తెలిపాడు. 

 

మరోవైపు ఈసినిమాలో అజయ్ దేవ్‌గణ్ బాహుబలి సినిమాలో కట్టప్ప తరహా పాత్ర చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్ నటిస్తోంది. అయితే  ఆర్ఆర్ఆర్ లో రామ్‌ చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్‌ లుక్స్ ఇవేనంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అందులో బ్రిటీష్ సైనికాధికారిగా కనిపిస్తుండగా, అలియా భట్ పాతకాలం నాటి పద్దతిలో చీర కట్టుకొని కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు కూడా అప్పటిలోలా బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉండటం విశేషం. 

 

అంతేకాదు వాటిపై రాజమౌళి ముద్ర కూడా ఉంది. మరి ఇవి నిజంగానే సినిమాలోవేనా..? లేక ఫ్యాన్స్ చేశారా..? అన్నది తేలియాల్సి ఉంది. కాగా, ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య రూ.350 కోట్ల నుంచి 400 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో మెగా, నందమూరి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. ఇద్దరు హీరోలకు సమన ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్త వహిస్తున్నారట. దీంతో మెగా, నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: