క్రికెట్ మైదానంలో తన  స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నారు.  గతంలో ఎన్నో కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ‘ఫ్రెండ్ షిప్’ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. ఈ మూవీకి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ  మూవీ నిర్మిస్తున్నారు. త‌మిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

 

ఇటీవల వచ్చిన తమిళ బిగ్ బాస్ లో  లోస్లియా మ‌రియ‌నేస‌న్ ఎంతో సందడి చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆమె బజ్జీ పక్కన హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ గురించి కొత్త అప్ డేట్ వచ్చింది.  హర్భజన్ నటిస్తున్న ఫ్రెండ షిప్ మూవీలో యాక్షన్ హీరో అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట.  అయితే అది పాజిటీవా.. నెగిటీవ్ గానా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఒకప్పుడు తెలుగు, కన్నడ, తమిళ సినీ పరిశ్రమలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు అర్జున్.  కొంత కాలంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నెగిటీవ్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. 

 

సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్ల‌డించనున్నారు.  హర్భజన్ సింగ్, యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, లోస్లియా మ‌రియ‌నేస‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ :  వేల్‌ మురుగ‌న్‌, రాబిన్‌,  ప్రొడ్యూస‌ర్స్ : జెపిఆర్ & స్టాలిన్, ద‌ర్శ‌క‌త్వం : జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య. ఈ మూవీ సమ్మర్ కానుకగా వివిధ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: