బాహుబలి సినిమాతో రాజమౌళి ప్రప్రంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ప్రపంచ సినిమాకి మన తెలుగు సినిమా సత్తా ఏంటో బాహుబలి ద్వారా చూపించి శభాష్ అనిపించుకున్నాడు. రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో చాలా బిజీగా గడుపుతున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

 


అయితే ఆర్.ఆర్.ఆర్ నుండి ఈ నిర్ణయం వచ్చినప్పటి నుండి అందరి ప్లాన్లు డిస్టర్బ్ అయిపోయాయి. మొదటగా ఆర్.ఆర్.ఆర్ జులై ౩౧ అని చెప్పినపుడు అందరూ ఆ సినిమా విడుదల తేదీని వదిలేసి తమ సినిమాల విడుదల తేదీలను ప్లాన్ చేసుకున్నారు. కానీ సడెన్ గా రాజమౌళి తన విడుదలని సంక్రాంతికి మార్చడంతో..సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న వారందరూ వేసవికి వెళ్ళిపోయారు.

 

 

ఒక్క సినిమాల విషయమే కాదు...ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న హీరోల తర్వాతి షెడ్యూల్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. రాజమౌళి తన సినిమా పూర్తయ్యేవరకి మరో సినిమాలో నటించరాదని కండిషన్ పెట్టాడట. దాంతో వారు వేరే సినిమాలై కూడా ఒప్పుకోవట్లేదు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ఓకే అయినప్పటికీ..అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలనే దానిపై క్లారిటీ లేదు. ఇక చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందనేది తెలియదు.

 

 


ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తయితే కానీ వీరిద్దరి తర్వాతి సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్పలేం.. రాజమౌళి నిర్ణయం మొత్తం ఇండస్ట్రీనే డిస్టర్బ్ చేసింది. మరి ప్రస్తుతం ప్రకటించిన తేదీనే రాజమౌళి తన సినిమాని విడుదల చేస్తాడా లేదా మళ్ళీ వాయిదా వేస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: