కొలీవుడ్ లో శింబుకి ప్లేబోయ్ అన్న పేరుంది. అతడు ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిలతో రిలేషన్ కొనసాగించాడని టాక్. శింబు ప్రేమలో పడ్డ మొట్టమొదటి హీరోయిన్ నయనతార. వీరిద్దరి కాంబినేషన్ లో వల్లభ అనే సినిమా వచ్చిన తర్వాత చాలా రోజులు ప్రేమలో ఉన్నారు. పెళ్ళి కూడా చేసుకుంటారని టాక్ వినబడింది. కానీ సడెన్ గా ఏమైందో తెలియదు వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ కలిసారనే వార్తలు వచ్చినా ప్రస్తుతం ఎవరి దార్లో వారున్నారు.

 

 


నయనతారతో విడిపోయిన అనంతరం శింబు మరో హీరోయిన్ ప్రేమలో మునిగిపోయాడు. ఆమే హన్సిక.. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని చాలా కాలం తిరిగారు. వీరిద్దరి మధ్య రిలేషన్ చాలా రోజులే నడిచింది. వీరిద్దరి మధ్య కూడా పెళ్ళి టాపిక్ వచ్చింది. ఇదుగో పెళ్ళి చేసుకుంటున్నారు. అదిగో పెళ్ళి చేసుకుంటున్నారు అంటూ రోజుకో వార్త వచ్చేది. కొలీవుద్ మీడియా అయితే వీరిద్దరి మధ్య బంధం గురించి చాలా వార్తలే రాసింది.

 

 

అయితే నయనతార లాగానే వీరిద్దరి ప్రేమ కూడా సగంలోనే ఆగిపోయింది. అప్పటి నుండి శింబు మరో అమ్మాయి ప్రేమలో పడలేదు. పడలేదో లేదా వార్తలు రాలేదో తెలియదు. అయితే ప్రస్తుతం శింబు ఒక అమ్మాయి ప్రేమలో డీప్ గా మునిగిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. సుభిక్ష అనే ఆ హీరోయిన్ తో శింబు చెట్టపట్టాలు వేసుకుని తిరగడం కెమెరాలకు చిక్కింది. అయితే శింబు ఎప్పటిలా ఈ వార్తల గురించి సైలెంట్ గా ఉన్నాడు.

 

 

సుభిక్ష మాత్రం శింబు తనకి స్నేహితుడు మాత్రమేనని, ఎక్కువ ఊహించుకోవద్దని మీడియాకి చెబుతోంది. అయితే శింబుతో ప్రేమలో ఉన్న రోజుల్లో నయనతార, హన్సిక కూడా ఇలాగె బొంకేవారు. అందుకే సుభిక్ష ఎంత ఖండించినా కానీ వీరిద్దరి గురించిన రాతలు మాత్రం రాసేస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య బంధమైనా పెళ్ళిదాకా వెళ్తుందా మధ్యలోనే ఆగిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: