టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లకు అందం.. అభినయం ఉన్నా లక్ కలిసి రాదంటారు.  అలాంటి జాబితాలోఉన్నవారే రాయ్ లక్ష్మీ, అంజలి.  తాజాగా ఈ ఇద్దరు హాట్ బ్యూటీలు M.V.V. సత్యనారాయణ సమర్పణలో  “ఆనంద భైరవి” చిత్రంలో నటిస్తున్నారు.   నంది అవార్డ్ గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని “నిధి మూవీస్, హరివెన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై బి తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి ఇటికేల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షాపింగ్ మాల్, జర్నీ వంటి చిన్న సినిమాలతో తన కెరియర్ స్టార్ట్ చేసి గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ లాంటి సినిమాలతో పెద్ద హీరోయిన్ స్థాయికి చేరుకున్న తెలుగు ముద్దుగుమ్మ అంజలి. 

 

 ఈఅమ్మడు తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచుకుంది.  కాంచనమాల కేబుల్ టీవి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల భామ  లక్ష్మి రాయి.  ఆ మద్య  జూలీ 2 తో కుర్రకారుని ఉర్రూతలూగించి, తమిళ్ లో ఎన్నో చిత్రాలలో నటించి, తెలుగు లో పలు చిత్రాలతో పాటు మెగా స్టార్ చిరంజీవి గారితో రత్తాలు రత్తాలు అంటూ  ఐటమ్ సాంగ్ చేసి యువతరం గుండెల్లో చెరగని ముద్ర వేసింది.  ప్రస్తుతం పాయిజన్ 2 లో శృంగార దృశ్యాలలో నటిస్తూ దేశవ్యాప్తంగా కుర్రకారుని పిచ్చెక్కించబోతుంది.

 

తాజాగా  ‘ఆనంద భైరవి’ చిత్రం కోసం గొడవ పడే సన్నివేశం లో పోటీపడి నటించారు. వైజాగ్‌ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ  సమర్పణలో నిధి మూవీస్, హరివేన్ ఎంటర్ టైన్‌మెంట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీరం తిరుపతి రెడ్డి-రమేష్ రెడ్డి ఇటికేల నిర్మాతలు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కర్రి బాలాజీ. సంగీతం: మణిశర్మ, కెమెరా: పీజీ విందా, ఎడిటర్ : చోట కె ప్రసాద్.  మరి ఈ మూవీ ఇద్దరు భామలకు కలిసి వస్తుందా రాదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: