మెగాస్టార్ నటించే 153వ సినిమా డైరెక్టర్ ఫిక్స్ అయిపోయాడు. చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా షూటింగ్ మొదలైంది. ఆ తర్వాత నటించే సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. ఇప్పటికే ముగ్గురు మెగా హీరోలకు హిట్స్ ఇచ్చిన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి. 


చిరంజీవి 153వ సినిమా దర్శకుడిగా హరీశ్ శంకర్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కోసం కథ రాసుకుంటున్న హరీష్ చిరంజీవిని కూడా డైరెక్టర్ చేస్తున్నట్టు కన్ఫార్మ్ చేశాడు. ఇదే నిజమైతే .. రామ్ చరణ్ మినహా మిగతా హీరోలందరినీ హరీష్ డైరెక్ట్ చేసినట్టే. ఇంతమంది మెగా హీరోలతో సినిమాలు తీసిన ఘనత హరీష్ కే దక్కుతుంది. 

 

హరీష్ దర్శకత్వంలో నటించాలన్న మెగాస్టార్ కోరిక ఇవాల్టిది కాదు. సాయిధరమ్ తేజ్, హరీష్ కాంబినేషన్ మూవీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో రిలీజ్ వేడుకలో చిరంజీవి తన మనసులోని మాటను బయటపెట్టాడు. చిరంజీవి తన 150వ సినిమా దర్శకుడిగా హరీష్ కు ఛాన్స్ ఇచ్చాడు. అయితే కథ రాయలేకపోవడంతో.. వినాయక్ తో ఖైదీ 150తీశాడు. చిరంజీవి.. పవన్ కు వీరాభిమాని అయిన హరీష్.. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి అదిరిపోయే హిట్ ఇచ్చాడు. త్వరలో పవర్ స్టార్ ని మరోసారి డైరెక్ట్ చేయనున్నాడు. 

 

చిరంజీవి, హరీశ్ శంకర్ సినిమా కన్ఫార్మ్ అయినా.. ఇప్పట్లో ఉండకపోవచ్చు. చిరంజీవి ప్రస్తతం కొరటాల సినిమాతో బిజీ. జులై నాటికి ఫ్రీ అవుతాడు. పవన్, హరీశ్ సినిమా ఇంకా మొదలుకాలేదు. ఎప్పుడు వస్తుందో అస్సలు చెప్పలేం. చిరంజీ ఛాన్స్ ఇచ్చేది లేనిది.. పవన్.. హరీష్.. సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. సినిమా హిట్ అయితే.. మెగాస్టార్ ముందుకొస్తాడు. కథ నచ్చితేనే ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతుంది. గతంలో 150వ సినిమాకు పూరీ ఇచ్చిన కథ నచ్చక.. రీమేక్ ను నమ్ముకొని.. ఖైదీ నెంబర్ 150తో వచ్చాడు మెగాస్టార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: