ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ప్రచారం అవుతున్నప్పటికీ దానిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై, నటి ఛార్మితో కలిస్ పూరి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా ఫీల్ తో అత్యంత భారీగా నిర్మితం అవుతన్న ఈ సినిమాకు బాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాత దర్శకుడైన కరణ్ జోహార్ దీనిని హిందీలో రిలీజ్ చేయనున్నారు. 

 

ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా విజయ్సినిమా కోసం ఎంతో కష్టపడి పలు యుద్ధ విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నిర్మాతల్లో ఒకరైన ఛార్మి రెండు రోజుల నుండి విజయ్ తో కలిసి పలువురు శిక్షణ ఇస్తున్న ఫైట్ మాస్టర్ల ఫోటోలు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. అయితే ఆ ఫోటోలను బట్టి చూస్తుంటే ఈ సినిమా కోసం ఖర్చు భారీ లెవెల్లో పెడుతున్నట్లు కొంత అర్ధం అవుతోంది. అయితే ఆమె పోస్ట్ చేసిన ఫోటోలపై కొంత భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

 

ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన పూరి గారు, మా విజయ్ కి కూడా సూపర్ హిట్ ఇవ్వాలని కొందరు విజయ్ ఫ్యాన్స్ కోరుతుంటే, మరికొందరేమో, ఛార్మి పోస్ట్ చేస్తున్న ఈ ఫోటోలను బట్టి చూస్తుంటే, సినిమా విషయమై బిల్డప్ బాగానే ఇస్తున్నారు గాని, సినిమాలో మెయిన్ బిజినెస్ అయిన కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉన్నాయా లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి పూరి ఈ సినిమాతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి తొలిసారి విజయ్, పూరి ల కాంబో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: