ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ సినిమా క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకునే దర్శకుడు, హీరోల గురించి పక్కన పెడితే అదే సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్రం తూచ్ ఇది డైరక్టర్ తప్పే అని హీరో.. హీరో చెప్పినట్టు వినలేదని డైరక్టర్ ఇలా గొడవ చేస్తారు. ఆఫ్ స్క్రీన్ లో జరిగే ఈ వ్యవహారం మీడియా కవర్ చేయకపోయినా సరే వీళ్లిద్దరి గొడవ వల్ల నిర్మాత జేబు ఖాళీ అవుతుంది. సినిమా కథ విన్న దగ్గర నుండి ఇంత బడ్జెట్ లో పూర్తి చేద్దామని చెబితే అంత కాదు తన మార్కెట్ రేంజ్ ఇది కాబట్టి ఇంత బడ్జెట్ పెట్టాల్సిందే అంటూ హీరో చెబుతాడు.

 

ఇక అడిగినంత బడ్జెట్ తో సెట్స్ మీదకు వెళ్లాక అదనపు హంగుల కోసం తడిసి మోపెడు అయ్యేలా చేస్తాడు. 10 అనుకున్నది కాస్త 15 అలా మరో 5 ఇలా కథగా అనుకున్నప్పుడు 10 కోట్ల లోపు బడ్జెట్ తో తీసేద్దాం అనుకున్న సినిమా కాస్త 20 కోట్ల పైగా ఖర్చు పెట్టడంతో ఆ భారం డిస్ట్రిబ్యూటర్ల మీద వేయాల్సి వస్తుంది. ఇదంతా డైరక్టర్, హీరో, ప్రొడ్యూసర్ ల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వల్లే జరుగుతుందని అంటున్నారు. హీరోని ఫైనల్ చేసినప్పుడే డైరక్టర్, ప్రొడ్యూసర్ మా బడ్జెట్ ఇది దీనికి ఓకే అంటేనే సినిమా లేదంటే వద్దని చెబితే ఇలాంటి ఘోరాలు జరుగవు.

 

10 కోట్ల లోపు అయిపోయే కథకు మరో 10 ఎక్సెస్ పెట్టిస్తే సినిమాలో మ్యాటర్ లేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడితే ఆ భారం ఎవరు భరించాల్సి ఉంటుందో ఆలోచించాలి. అంతా అయ్యాక నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు చారి గారు అని డైలాగ్ చెప్పి తప్పించుకునే హీరోలు టాలీవుడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమా ఫస్ట్ కాపీ చూసి సినిమా వర్క్ అవుట్ అవుతుందని నమ్మకం కుదిరితేనే ప్రమోషన్స్ కు కూడా వస్తారట. లేదంటే ప్రమోషన్స్ కు డబ్బులు దందడని వాదిస్తారట. ఇలా సినిమాలో ఆఫ్ స్క్రీన్ లో జరిగే ఈ విషయంపై దర్శక నిర్మాతలు హీరోలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: