కేఎస్ రామారావు టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరుగా ఉండేవారు ఒకప్పుడు. ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. అయితే అప్పట్లో ఆయన నిర్మించిన సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడంతో దాదాపుగా 400కోట్లు పైగానే ఆస్తులు సంపాదించారని సమాచారం. అలాగే ఆయన సంపాదించిన డబ్బు మొత్తం పోతూ ఉన్నా కూడా సినిమాలు నిర్మించడం మాత్రం ఎక్కడా వదల్లేదు.
తేజ్ ఐ లవ్ యూ, కౌసల్య కృష్ణమూర్తి ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా వరుసగా చిత్రాలు నిర్మిస్తూనే ఉన్నా ఏ ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ ముందు మంచి కలెక్షన్లను పట్టలేదు. ఫ్లాపుల మీద ఫ్లాప్‌లు వస్తూనే ఉన్నాయి. గతంలో ఎన్ని సినిమాలు నిర్మించినా కూడా ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరి రెమ్యూనరేషన్లని ఆపకుండా ఇస్తూ ఆఖరికి ఆయన ఆస్తులు కూడా అమ్ముకున్న సందర్భాలు ఎన్నో. ఒక హీరోకు తన లగ్జరీ కారును బ్యాలన్స్ పారితోషికం కింద ఇచ్చాడని వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.
ఇటీవలె విడుదలైన క్రేజీ యూత్ హీరో విజయదేవరకొండ చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్` పారితోషికంగా తన ఆస్తిని ఇచ్చినట్లు సమాచారం. ఇక ఫైనాన్స్ర్స్కు అయితే కోట్ల విలువ చేసే భవనాలను ఇచ్చాడు. ఈ విధంగా ఆయన ఎన్నో నష్టాలను భరిస్తూ సినిమాలను నిర్మిస్తున్నారు. చేతిలో డబ్బు లేకున్నా కూడా వరుసగా చిత్రాలు నిర్మించడంతో ఆస్తులను కూడా అమ్మేసుకోవాల్సి వచ్చిందట. ప్రస్తుతం కేఎస్ రామారావు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో మాదాపూర్‌లోని ఒక ఇంట్లో అద్దెకు ఉండాల్సిన పరిస్థితి.
సినిమాల పైన ఇంట్రస్ట్ ఉండడం గొప్ప కాదు. మనం ఎంచుకునే కథలు గొప్పగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్‌గా ఉండాలి. ఆయన ఎంచుకునే కథలు బావుండడం లేదనే విమర్శలు కూడా ఓ పక్క వినిపిస్తున్నాయి. మరి ఇక నుంచైనా సరే ఆయన ఏదైన కథ ఎంచుకునేటప్పుడు సరైన కథలను ఎంచుకుంటూ వెళితే బావుంటుందని కోరుకుందాం.