విదేశాల్లో సూపర్ హిట్ అయిన బిగ్ బ్రదర్‌ షోను ఇండియాలో బిగ్ బాస్‌ పేరుతో లాంచ్‌ చేసిన సంగతి తెలిసింది. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం అవుతున్న షో, అన్ని చోట్ల సూపర్‌ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. ముఖ్యంగా హిందీలో సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో 13 సీజన్‌ లు పూర్తి చేసుకుంది. ఇటీవల 13వ సీజన్‌లో విజేతగా సిద్ధార్థ్‌ శుక్లాను ప్రకటించారు. అయితే ఈ సీజన్‌లో విజేత ఎంపిక విషయంలో సల్మాన్‌ నిరుత్సాహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 

ముఖ్యంగా సిద్ధార్థ్‌ను విజేతగా ప్రకటించిన తరువాత సోషల్ మీడియాలో విపరీతంగా నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా ఓ నిర్వాహకులు సిద్ధార్థ్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. దీంతో సల్మాన్‌ కూడా విజేత విషయంలో నిరుత్సాహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు వీకెండ్‌ కా వార్ కార్యక్రమంలో సల్మాన్‌ తన అభిప్రాయాన్ని బహిరంగంగానే వెల్లడించినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

 

జాతీయ మీడియాలో వచ్చిన కథ ప్రకారం.. `చానల్‌ నిర్మాహకులు ఈ సీజన్‌ అంతా సిద్దార్థ్‌ శుక్లాకు అనుకూలంగా వ్యవహిరంచినట్గుగా సల్మాన్ భావిస్తున్నారు. చివరకు సిద్ధార్థ్‌నే విజేతగా ప్రకటించటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అందువల్లే బిగ్ బాస్‌ ఫినాలే షూటింగ్ కూడా ఆలస్యమైంది. చివరకు ఈ సీజన్‌ను పూర్తి చేసినా.. ఇక మీద బిగ్‌ బాస్‌ నిర్వహకులతో కలిసి పనిచేకూడాదని సల్మాన్‌ నిర్ణయించుకున్నాడు` అంటూ ప్రముఖ వెబ్‌ సైట్ పింక్‌ విల్లా ఓ కథనాన్ని ప్రచురించింది.

 

అయితే సల్మాన్‌ బిగ్ బాస్‌ షో నుంచి తప్పుకుంటున్నట్టుగా వార్తలు రావటం ఇదే తొలిసారికాదు. గతంలోనూ సల్మాన్‌ బిగ్ బాస్‌ నుంచి తప్పుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. మధ్యలో కొన్ని సీజన్లకు ఇతర తారలు కూడా వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. అయితే ఎవరు చేసిన షోను సల్మాన్‌ స్థాయిలో మాత్రం పండించలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: