నితిన్ స‌రికొత్త ఉత్సాహంతో, ఫుల్ హ్యీపీ మూడ్‌లో ఉన్నాడు. నితిన్ న‌టించిన హార్ట్ఎటాక్ మూవీ ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. హార్ట్ఎటాక్ మూవీ ప‌రిస్థితి ఏంట‌న్నది ప‌క్కన పెడితే, నితిన్ మాత్రం ఖుషీ ఖుషీగా ఉన్నాడు. నితిన్ ఇంత ఆనందంతో ఉండ‌టం ఇప్పుడే చూస్తున్నాము అని టాలీవుడ్‌లోని కొంద‌రు చెబుతున్నారు. పూరిజ‌గ‌న్నాధ్ సైతం నితిన్ ఆనందానికి కారణం ఏంటో అంతుబ‌ట్టడంలేదంట‌. కార‌ణం ఏంటంటే హార్ట్ఎటాక్ మూవీకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆశీస్సులు ల‌భించ‌టే ఇందుకు కార‌ణం. ప‌వ‌న్ ఆశీస్సులు లేకుండా మూవీను రిలీజ్ చేయ‌డం అంటే నితిన్‌కి అది ఓ సాహ‌సంగానే చెప్పవ‌చ్చు. రేయ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోటి నుండి నితిన్ పేరు బ‌య‌ట‌కు రావ‌డం, ఆ స‌మ‌యంలో నితిన్ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్ హార్ట్ఎటాక్‌ను అంద‌రూ గుర్తుచేసుకోవ‌డంతో హార్ట్ఎటాక్ మూవీకు ఎంత ప‌బ్లిసిటి రావాలో అంత ప‌బ్లిసిటి, అప్పుడే వ‌చ్చింది. ఒక‌వేళ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేయ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో నితిన్ గురించి ఏమి చెప్పకుండా ఉన్నట్టైతే, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేత హార్ట్ఎటాక్ మూవీకు సంబంధించిన ప్రత్యేక స్పంధ‌న‌ను షూట్ చేయించి, టెలివిజ‌న్స్‌లో టెలికాస్ట్ చేసేందుకు ప్లానింగ్స్ వేసుకున్నాడు. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేక‌పోవ‌డంతో నితిన్, హార్ట్ఎటాక్ మూవీ రిలీజ్‌పై సంతోషంగా ఉన్నాడంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: