తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో ధనుష్ నటిస్తున్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే.  ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయిన అసురన్ ఏకంగా రూ.150 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.  ఈ చిత్రం తెలుగు లో వెంకటేష్ ‘నారప్ప’గా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌, మెహరీన్‌ జంటగా ‘ లోకల్ బాయ్’ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ సంయుక్తంగా నిర్మించిన ఓ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ తెలుగులో తెరకెక్కిస్తున్నారు.   

 

ఈ చిత్రం గురించి నిర్మాత సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ... 'మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రం కోసం ధనుష్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. వాస్తవానికి ధనుష్ కెరీర్ బిగినింగ్ లో ఎన్నో మార్షల్ ఆర్ట్స్ చిత్రాల్లో నటించాడు. ఇక  ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. ఇందులో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఆ మద్య తెలుగు లో రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది.   

 

ఈ నెల 28న విడుదలవుతున్న సినిమా కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ధనుష్ తన మార్షల్ ఆర్ట్స్ తో దుమ్మురేప బోతున్నారట.  తెలుగు లో ధనుష్ నటించిన మారి, మారి 2 చిత్రాలకు మంచి టాక్ వచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా లోకల్ బాయ్ మూవీతో మరో ఘన విజయం సాధిస్తారని చిత్ర యూనిట్ అంటున్నారు.  ఈ చిత్రం తమిళ్ లో పటాస్ గా రూపొందింది.  ఈ చిత్రంలో స్నేహ కూడా కొన్ని మార్షల్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. సినిమాలో మెహరీన్‌, స్నేహ, నవీన్‌ చంద్ర, నాజర్‌ వంటి తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువగా ఉండటంతో తెలుగు సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: