టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ గా పేరు గాంచిన యువ నటుడు రామ్, ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రామ్ తన అదిరిపోయే మాస్ యాక్షన్ తో ఇరగదీయగా, పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్, కథనం, అలానే మణిశర్మ అందించిన సూపర్ సాంగ్స్, ఈ సినిమాని ఎంతో గొప్ప విజయతీరాలకు చేర్చాయి. యువత తో పాటు మాస్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడడానికి బాగా ఎగపడ్డారు. 

 

ముఖ్యంగా అంతకముందు చాలా ఏళ్ల నుండి సరైన సక్సెస్ లేని హీరో రామ్, తో పాటు పూరి జగన్నాథ్ కూడా ఎంతో కసితో ఈ సినిమా కోసం వర్క్ చేయడం, అలానే సినిమాలోని మాస్, యాక్షన్ అంశాలు ప్రేక్షకులకు చేరువ కావడంతో సినిమాపై ప్రశంసలతో పాటు కలెక్షన్స్ వర్షం కూడా కురిసింది. నిజానికి మొదట్లో కొంత మిశ్రమ స్పందనను రాబట్టిన ఈ సినిమాకు మెల్లగా ఆడియన్స్ కనెక్ట్ అవుతూ వచ్చారు అనే చెప్పాలి. ఇక నిర్మాతలకు కూడా కాసుల పంట కురిపించిన ఈ సినిమా నిన్న యూట్యూబ్ లో అదే పేరుతో హిందీ డబ్బింగ్ వర్షన్ ని రిలీజ్ చేసింది ఆదిత్య మ్యూజిక్ సంస్థ. 

 

అయితే రిలీజ్ అయినా దగ్గరి నుండి విపరీతమైన ఆదరణతో దూసుకెళ్లిన ఈ సినిమా, గడిచిన కేవలం 24 గంటల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని 500కె లైక్స్ ని దక్కించుకుని ఒక కొత్త రికార్డు దిశగా దూసుకుపోతోంది. నిజానికి ఈ సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్ అని, ఏ భాషలో అయినా ఈ సినిమా సూపర్ గా సక్సెస్ సాదిస్తుందని, గతంలో పూరి ఒక సందర్భంలో చెప్పకనే చెప్పారు. ఇక ఈ విధంగా మొత్తానికి ఇటు తెలుగుతో పాటు అటు హిందీ వర్షన్ లో కూడా మంచి వీక్షకాధరణతో దూసుకుపోతున్న ఈ సినిమా, హీరో రామ్ తో పాటు దర్శకుడిగా పూరి క్రేజ్ ని మరింతగా పెంచింది అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: