ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే చాలా వరకు స్లో గా సినిమాలు చేయడమే కాకుండా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో రానా ఒకరు. తన తండ్రి నిర్మాత అయినా సరే ఏ కథ పడితే ఆ కథతో సినిమా చేయకుండా తన మార్క్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అరణ్య అనే సినిమాలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియో లో రానా లుక్స్ గాని అతని అరుపులు గానీ అన్నీ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రానా, వేణు ఉడుగుల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విరాటపర్వం అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా రానా చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయింది కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. 

 

ఈ సినిమాలో విలక్షణ నటి నందితా దాస్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. దర్శకుడు వేణు ఉడుగులకు ట్వీట్ చేసారు ఆమె. ‘’ప్రస్తుతం ‘విరాట్ పర్వం’ సినిమా సెట్స్ లో ఉన్నా. తెలుగులో మాట్లాడటం కంటే సెట్స్ లో ఉండటం సంతోషంగా ఉంది.’’ అని ఆమె పోస్ట్ చేసారు. ఇక వేణు కూడా ఆమె ట్వీట్ కి రెస్పాండ్ అయ్యారు. నందితా దాస్‌తో వర్క్ చేయడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ కి రిప్లయ్ ఇచ్చారు. ఈ సినిమా రెండు మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: