ఒక తెలుగు సినిమా వస్తుంది అంటే యువత జోరు మాములుగా ఉండదు. సినిమాలో ఎంత మెసేజ్ ఇచ్చిన కూడా అది కొంత మంది యువతను మాత్రమే ఆకట్టుకుంటుంది. ఇకపోతే సినిమాలో ఏది ఉన్న లేకున్నా హీరోయిన్ అందం చూసి చాలా మంది కుర్రాళ్ళు సినిమాలను చూడటానికి ఎగబడుతుంటారు. మరో విశేషమేంటంటే.. హీరోయిన్ కన్నా అందంగా ఐటెం సాంగ్స్ చేసే ముద్దు గుమ్మలు కనపడుతూ యువతను హోరెత్తించారు. 

 


అయితే, ఇప్పటికింగా నా వయస్సు నిండా పదహారే అని,  కెవ్వు కేక, ఆ అంటే అమలాపురం అంటూ ఎన్నో సాంగ్స్ లలో ప్రత్యేకంగా నర్తించి కుర్రాళ్ళ కళ్ళను తిప్పుకోకుండా చేసిన ఐటెం పాపలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. మరి వారిప్పుడు ఎం చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. మరి ఇంకా ఆలస్యమెందుకు వారేం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

 


ముమైత్ ఖాన్ : 

ఇప్పటికింగా నా వయస్సు నిండా పదహారే అంటూ అంద చందాలతో అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టి యువతను కట్టిపడేసిన ఈమె ఇప్పుడు సినిమాలలో పెద్దగా కనిపించలేదు. ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమైన సూపర్ రియాలిటీ షో లో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు దూరంగా ఉంది. సినీ అవకాశాలు లేకనో, లేక మారె ఇతర కారణాల వల్లనో సినిమాలల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఏవో సొంత బిజినెస్ చేసుకుంటూ ఉందని సమాచారం. 

 

మల్లికా శెరావత్ : 

బాలీవుడ్ బ్యూటీ అయిన మల్లికా శెరావత్ ఈ మధ్య ఎక్కడ సినిమాలలో కనిపించలేదు. తెలుగుతో పాటుగా హిందీలో ఎన్నో ప్రత్యేక గీతాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది.  ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాయామానికి, బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ జాలి ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తుంది. 

 


అభినయ : 

అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా  బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో వచ్చిన ప్రత్యేక గీతం ఆ అంటే అమలాపురం సాంగ్ ఇప్పటికి కూడా వినపడుతుంది. అయితే అభినయ మాత్రం ఇప్పడు సినిమాలలో ఎక్కడా కనిపించలేదు. పెళ్లి చేసుకున్నట్లు కూడా ఎక్కడ వినపడలేదు మరి ఎం చేస్తున్నారో ఎవరికీ తెలియదు.. ఇది ఒకప్పుడు తళుక్కుమన్న ఐటెం పాపలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: