సిని పరిశ్రమకు, క్రికెటర్లకు అవినాభావ సంబంధం ఉందీ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సరే సినిమా హీరోయిన్లతో క్రికెటర్లు ప్రేమ వ్యవహారాలు నడపడం అనేది ఈ మధ్య కామన్ గా మారిపోయిన వ్యవహారం. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ఎన్నో సినిమాలు చేసిన హీరోయిన్ అయినా సరే క్రికెటర్ లైన్ వేయగానే ఓకే చెప్పేస్తుంది. దానికి కారణం వాళ్లకు ఉన్న క్రేజ్ తో పాటుగా వచ్చే డబ్బు కూడా. అయితే ఇప్పుడు మాత్రం ఆటగాళ్ళు కాస్త భయపడుతున్నట్టు సమాచారం. 

 

బాలీవుడ్ అనగానే కాస్త మాఫియా తో కూడా సంబంధం ఉండే సిని పరిశ్రమ. ఎందరో మాఫియా డాన్ లో ఆ సినిమాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. దీనితో హీరోయిన్లను కూడా బుట్టలో వేసుకుంటారు. ఈ నేపధ్యంలోనే ఈ మధ్య హీరోయిన్లను ఎరగా వేసి ప్లాన్ చేస్తున్నారట. దీనితో ఇప్పుడు హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. హీరోయిన్లకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు క్రికెటర్లు. ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే అవసరం లేదు అనే భావనలో ఉంటున్నారట. 

 

ఇప్పటికే క్రికెట్ కి ఫిక్సింగ్ మరక అంటుకుంది. చిన్న తేడా గా ప్రవర్తించినా సరే ఇప్పుడు వాళ్ళను అనుమానంగా చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే హీరోయిన్లకు దూరంగా ఉంటే ఏ గోలా ఉండదు అని భావించిన క్రికెటర్లు ప్రేమించాలి అనుకుంటే తమకు పరిచయం ఉన్న వాళ్ళను ప్రేమిస్తున్నారు గాని మరొకరిని వద్దని భావిస్తున్నారట. క్రికెట్ లోకి అవకాశం రావడం అనేది చాలా కష్ట౦ అనే సంగతి తెలిసిందే. వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి గాని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం కెరీర్ మొదట్లోనే ఆగిపోతుంది. అందుకే ఎవరైనా హీరోయిన్లు నచ్చినా సరే ఫోన్ లో చూసి ముద్దు పెట్టుకుని వదిలేస్తున్నారు గాని వాళ్ళతో మాట్లాడటం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: