టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు గా ఉన్న వాళ్ళు, కాజల్, అనుష్క, తమన్నా... వీళ్ళు సిని పరిశ్రమలోకి అడుగు పెట్టి దశాబ్దం దాటింది. కాజల్ అయితే దాదాపు 15 ఏళ్ళు అయింది. అనుష్క కూడా అంతే ఇంచుమించుగా. కాని ఇప్పటి వరకు వీళ్ళు పెళ్లి మాత్రం చేసుకోలేదు. వీళ్ళ మీద రూమర్లు రావడమే గాని ఇప్పటి వరకు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అనేది ఒక్క అధికారిక వార్త కూడా ఎక్కడా రాలేదు. టాలీవుడ్ లో వీళ్ళు ఇప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నారు. అనుష్క ఆచితూచి సినిమాలు ఓకే చేస్తుంది. 

 

కాజల్ కూడా చాలా జాగ్రత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చిన అవకాశాలను వాడుకుంటుంది. సమంతా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. ఇలా వీళ్ళు సినిమాల్లో నటించడమే గాని మూడు ముళ్ళు మాత్రం వేయించుకునే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. టాలీవుడ్ లో వీళ్ళ పెళ్లి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీళ్ళ పెళ్లి చూడటం కూడా చాలా మందికి కల కూడా అంటున్నారు. అనుష్క ఇటీవల ఒక క్రికెటర్ ని పెళ్లి చేసుకుంటుంది అనే ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలియదు. 

 

కాజల్ ఎవరో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగినా అది నిజం కాదని తెలిసింది. తమన్నా ఎవరో ముంబై వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంటుంది అంటున్నారు. కాని ఎక్కడా కూడా అధికారిక ప్రకటన లేదు. వీళ్ళకు 35 ఏళ్ళు దాటి ఏళ్ళు అయింది. మరి ఎప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుంటారో అనేది అందరికి ఒక ఆసక్తికర విషయమే. టాలీవుడ్ లో చాలా వరకు ఇప్పుడు వీళ్ళ హవా తగ్గింది. కొత్త వాళ్ళు వస్తున్నారు గాని వీళ్ళను కేవలం ఏదో ఒక సినిమాకే అంగీకరిస్తున్నారు. ఇంకా సినిమాలు అంటూ టాలీవుడ్ ని పట్టుకుని వేలాడుతున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: