స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శక ధీరుడు రాజమౌళిని తిట్టుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ రాజమౌళిని తిట్టుకోవడమేంటి...? అని ఆశ్చర్యపోతున్నారా..? రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేయడం వలన కొరటాల శివకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి 2021 జనవరి 8వ తేదీకి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేయడంతో మిగతా హీరోలు, దర్శకులు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను మార్చుకుంటున్నారు. 
 
2021 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న సినిమాల రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు పోటీగా తమ సినిమాలను విడుదల చేసినా థియేటర్లు దొరకవని ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాన్ని చూసిన తరువాత ప్రేక్షకులు సంక్రాంతికి విడుదలైన మరో సినిమా చూడటం కష్టమే అని స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నారు. 
 
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చడం వలన కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కూడా వాయిదా పడనుండటంతో కొరటాల రాజమౌళిని తిట్టుకుంటున్నాడని తెలుస్తోంది. కొరటాల చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ నటించడం వలన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తరువాతే ఈ సినిమా రిలీజ్ చేయాలే తప్ప అంతకుముందు విడుదల చేసే అవకాశం లేదు. 
 
మరోవైపు రామ్ చరణ్ తన తదుపరి సినిమాకు ఎప్పటినుండి డేట్స్ ఇవ్వాలో కూడా అర్థం కాక అయోమయంలో ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ రాజమౌళి 2021 సంక్రాంతికి విడుదల చేయకుండా మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తే మాత్రం ఇతర దర్శకనిర్మాతలకు ఇబ్బందులు తప్పవు.                          

మరింత సమాచారం తెలుసుకోండి: