ప్రేక్షకుల్లో విశేషమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ రెబల్‌స్టార్ బాహుబలి చిత్రానికి ముందు అంతగా సోషల్ మీడియాలో ట్రోల్ అవకపోయేవారు.. ఎప్పుడైతే బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి ఊహించలేనంతటి విజయాన్ని సాధించిందో, అప్పటి నుండి ప్రభాస్ పేరు కూడా అంతర్జాతీయ స్దాయిలో మోగిపోడం మొదలు పెట్టింది.. ఇదిలా ఉండగా అనూష్కకు, ప్రభాస్‌కు మధ్య లవ్ ఎఫైర్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అ గాసిప్స్ ఇప్పటివరకు కూడా అలానే కొనసాగుతున్నాయి.. ఈ విషయంలో ఎంతగా వీరు క్లారీటి ఇచ్చినప్పటికీ అభిమానుల్లో మాత్రం దాగిఉన్న అనుమానాన్ని పూర్తిగా తొలగించలేక పోతున్నారు..

 

 

ఇకపోతే ఈ ఒక్క విషయంలోనే కాకుండా ప్రభాస్ ఫలానా దర్శకుడి చిత్రానికి   కమిటయ్యారు అంటూ ఓ హాట్ డిబేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టడం రకరకాల సందేహాలకు తావిస్తోంది. ఇంతటితో ఆగని ఈ గాసిప్స్ ఇంకాస్త ముందుకు వెళ్లి, ప్రభాస్ కోసం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి వెయిటింగ్ లో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అలాగే  మిర్చి తర్వాత మళ్లీ అదిరిపోయే స్క్రిప్టును ప్రభాస్ కోసం, కొరటాల రెడీ చేశారని.. డాషింగ్ డైరెక్టర్ పూరి సైతం ప్రభాస్ కి స్కెచ్ వేశాడని,  మళ్లీ ప్రభాస్ ని రాజమౌళి సైతం బరిలోకి దించుతాడని కొన్ని యూట్యూబ్ కథనాలు వేడెక్కించాయి..

 

 

పోనీ ఇంతటితో ఈ ప్రచారాలు ఆగాయా అంటే అదీలేదు, చివరికి నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా పేర్లను కూడా కలిపేసి, చికెన్ బిర్యానికోసం మసాలలు రుబ్బినట్లుగా వీరందరితో ప్రభాస్ సినిమాలకు ముడిపెట్టేస్తున్నారు. ఒక క్లారీటి లేని ఇలాంటి అయోమయ వార్తలను చదువుతున్న ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఏం పిచ్చిపిచ్చిగా ఉందా ఎవరు ఖాళీగా ఉన్నా ప్రభాస్ తో లింకు కలిపేస్తున్నారు. అని గరం అవుతున్నారట.. నిజమే కదండీ తక్కువగా మాట్లాడే ఈ రెబల్ స్టార్‌ను ప్రతివిషయంలో తేరగా వాడటం పరిపాటి అయింది అందరికి అని అనుకుంటున్నారట కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: