గత కొంత కాలంగా సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే.   ఈ విషయం పై ఇటీవల  నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున పోరాటం చేసింది.  అయితే ఆమె మద్యలోనే డ్రాప్ అయి ఇంటి నుంచి సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై కామెంట్స్ చేస్తుంది.  ఇక బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం తో తనూ శ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ పై లైంగికంగా వేధించాడని ఆరోపణ చేసింది.  ఇక కోలీవుడ్ లో సింగర్ చిన్మయి రచయిత వైర ముత్తుపై లింగక వేదింపుల ఆరోపణ చేసింది.  ఇలా ఆరోపణలు చేసి ఎవరు వారిపై ఏమీ సాధించలేక పోయిన విషయం తెలిసిందే. 

 

తాజాగా కోలీవుడ్ నటి అమలా పాల్ కి ఇలాంటి ఛేదు అనుభవమే మిగిలింది. ఎలాంటి విషయం గురించి అయినా అమలాపాల్ ధైర్యంగా మాట్లాడేస్తుంది. సౌత్ లో ఎదురవుతున్న లైంగిక వేధింపులపై  పలు సందర్భాల్లో ధైర్యంగా మాట్లాడింది.  2018లో అమలాపాల్.. భాస్కరన్ అనే వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. చెన్నైలోకి  కొరియోగ్రాఫర్ శ్రీధర్ కు చెందిన స్టూడియోలో అమలాపాల్ డాన్స్ రిహార్సల్స్ లో ఉండగా  ఓ వ్యక్తి తనపై లైంగికంగా వేధించినట్లు.. తనతో కమిట్ కావాలని అడ్వాన్స్ కూడా ఇవ్వ జూపినట్లు పోలీస్ కంప్లేంట్ ఇచ్చింది. 

 

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూాడా తెలిపింది.  దీనితో పోలీసులు అలగేషన్ ని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో తాను భాస్కరన్ అనే వ్యాపారవేత్త పంపించి తనతో బేరం ఆడమని చెప్పినట్లు ఆ వ్యక్తి వెల్లడించాడు.  దాంతొ  పోలీసులు భాస్కరన్ పై కూడా కేసు నమోదు చేశారు. భాస్కరన్ మాత్రం తనకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని.. ఈ కేసుకు వ్యతిరేకంగా కోర్టుని ఆశ్రయించారు.  తాజాాగా చెన్నై కోర్టు లో భాస్కర్ కి అనుకూలంగా స్టే ఇచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: