ఓ పక్క బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లో కూడా ఛాన్సులు పట్టేస్తున్న కియరా అద్వాని సినిమాల్లోనే కాదు వెబ్ సీరీస్ లో కూడా విజృభించేస్తుంది. అమ్మడు చేసిన లస్ట్ స్టోరీస్ ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చిందో తెలిసిందే. ఆ తర్వాత కియరాకి వరుసగా వెబ్ సీరీస్ ఛాన్సులు వస్తున్నాయి. ఆ కోవలోనే లేటెస్ట్ గా గిల్టీ అనే వెబ్ సీరీస్ రెడీ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో మార్చ్ 6 నుండి అందుబాటులో ఉండబోయే ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది.

 

కాలేజ్ లైఫ్ లో ఫ్రెండ్స్ తో జాలీ లైఫ్ లీడ్ చేస్తుంది కియరా అద్వాని. కియరా స్నేహితుల్లో ఒకరు రేప్ కు గురవుతారు. రాత్రికి రాత్రే వారి జీవితాలన్ని చిన్నా భిన్నం అవుతాయి. అబ్బాయిని అమ్మాయి రేప్ చేసిందంటూ సస్పెన్స్ లేవనెత్తుతారు. అసలు అమ్మాయి ఎలా అబ్బాయిని రేప్ చేస్తుంది. కావాలనే కేస్ తప్పుదారి పట్టించడానికి అమ్మాయి రేప్ చేసినట్టుగా చెప్పారా అన్నది తెలియాలంటే ఈ వెబ్ సీరీస్ చూడాల్సిందే.

 

వెబ్ సీరీస్ ల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో నెట్ ఫ్లిక్స్ కియరాతో చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ గిల్టీ. కియరా అల్ట్రా మోడ్రెన్ లుక్ లో అదరగొట్టేస్తుంది. ప్రస్తుతం తనకు ఉన్న ఫాలోయింగ్ కు ఈ వెబ్ సీరీస్ దుమ్ముదులిపేస్తుందని చెప్పొచ్చు. సినిమాకు ఏమాత్రం తగ్గని కంటెంట్ తో వస్తున్న ఈ వెబ్ సీరీస్ లో మిగతా ఆర్టిస్టులు కూడా అదరగొట్టేశారు. లస్ట్ స్టోరీస్ తర్వాత కియరా చేసిన ఈ వెబ్ సీరీస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. వెబ్ సీరీస్ లే కాదు హిందీతో పాటుగా తెలుగులో కూడా క్రేజీ ఛాన్సులు కొట్టేస్తుంది కియరా అద్వాని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: