తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలు కథకే కాకుండా కామెడీకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఒకప్పుడు కామెడీ అయితే చెప్పనక్కర్లేదు. న్యాచురల్ కామెడీతో కేవలం ముఖంలో కోన్ని రకాల వేరియేషన్స్ చూపిస్తూ నటించడం వల్ల సినిమాకు కమ్మేది హైలెట్ గా నిలిచేది. కానీ ఇప్పుడు వస్తున్నా సినిమాలలో స్వచ్ఛమైన కామెడీ ఎక్కడ కనిపించలేదు. నాన్ సింక్ పంచెస్, డబల్ మీనింగ్ డైలాగులు. వాటినే కామెడీ అనుకోని చాలా మంది ఆర్టిఫీషియల్ నవ్వులు నవ్వుతుంటారు. 

 

 

విషయానికొస్తే ఈ మధ్య కామెడీ కి ప్రాధాన్యం ఉన్న సినిమాల కన్నా రొమాన్స్ కు కేరాఫ్ గా ఉన్న సినిమాలు దర్శనమిస్తున్నాయి. మరి అప్పటి సినిమాలలో మెరిసిన కామెడీ తారలు ఇప్పుడు ఎం చేస్తున్నారు.. అసలు వారు ఉన్నారా అనే విషయాన్నీ చూస్తే.. చాలా మంది స్వర్గస్తులు అయ్యారు. ఇప్పుడు అందుకే సినిమాలన్నీ కేవలం రొమాన్స్. శృతి మించిన శృంగారం తో నడుస్తున్నాయి. దాంట్లో తప్పు కూడా లేదు లెండి. యువత వాటినే ఎక్కువగా చూస్తున్నారు కూడా. 


ఇకపోతే నింగికి ఎగసిన కామెడీ తారలు ఎవరో ఇప్పుడు చూద్దాము.. 


ధర్మవరం సుబ్రహ్మణ్యం.. ఎన్నో చిత్రాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఈయన మూడేళ్ళ క్రితం స్వర్గస్తులు అయ్యారు. అనారోగ్య సమస్యతో భాదపడుతూ వచ్చిన ఈయన కన్నుమూశారు. సినిమాలలో తన కామెడీకి ఒక మార్క్ ఉందన్న సంగతి తెల్సిందే.. 

 

ఏవీఎస్..  ప్రత్యేక కామెడీకి కేరాఫ్ ఏవీఎస్.. ఈయన కూడా గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే..అనారోగ్యం కారణంగా ప్రాణాలను విడిచారు.. 

ఎం ఎస్ నారాయణ : కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..
ఆయన సినిమాలలో ఒక గ్రేడ్ మార్క్ ఉందన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈయన కూడా మరణించారు.. 

ప్రస్తుతం బ్రహ్మానందం, ఆలి , సునీల్, వంటి కమెడియన్లు ఇప్పటికీ సినిమా లలో నటిస్తూ బిజీగా ఉన్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: