టాలీవుడ్ లో కాదు మొత్తం సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. ఫస్ట్ సినిమా ఆఫర్ రావడానికి కొంతమంది అమ్మాయిలు ఎంత కష్టపడతారో వాళ్ళు లైం లైట్ లోకి వచ్చి చెప్పినప్పుడే తెలుస్తుంది. ముందు మోడల్ గా ప్రయాణం మొదలు పెడతారు. కానీ ఆ ప్రయాణం కూడా అంత సులభంగా మొదలవదు. ఈ విషయం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తన వ్యకిగత అనుభవం తెలిస్తే కన్నీళ్ళు రావాల్సిందే. ఇంట్లో నుంచి ముంబై వచ్చిన వచ్చి పడ్డ అవస్థలు, గడిపిన తిండిలేని రాత్రులు ఎన్నో గడిపింది. జీవితం ఎలా ఉంటుందో ఆ సమయంలోనే తెలుసుకుంది. అప్పుడే కసి పెరిగింది ..మొదటి సినిమా అవకాశం రాగానే ప్రాణం పెట్టి నటించింది. అంతే ఆ ఒక్క సినిమాతో తనేంటో నిరూపించుకుంది. ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండా పోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో రేంజ్ కంగనా కి ఉందంటే అతిశయోక్తి కాదు. కొన్ని కథలకి సినిమాలకి కంగన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

 

ఇక ఇలాంటి హీరోయిన్ టాలీవుడ్ లోను ఉన్నారు. తనే స్వీటీ అనుష్క. అక్కినేని నాగార్జున హీరోగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో అనుష్క సూపర్బ్ అనిపించుకున్నారు. అయితే ఇక్కడ ఇమడటం కష్టమని ఈ ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదామని ఫిక్సైంది. కానీ ఈరఒజు వరకు అనుష్క మసులో ఆ ఆలోచన మళ్ళీ రాలేదంటే సూపర్ సక్ససే అని చెప్పాలి. సినిమా పట్ల అనుష్క కి ఎంతటి డెడికెషన్ ఉందో అది మొదటి సినిమాకి తను పడ్డ కష్టమేనని చెప్పాలి. దాదాపు తొమ్మిది నెలలపాటు అలా వచ్చి సెట్ లో ఓపికగా కూర్చున్న హీరోయిన్ అనుష్క. ఇక అరుంధతి సినిమా తర్వాత అనుష్క రేంజ్ కూడా టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో రేంజ్ అని చెప్పాల్సిందే. అయితే అలాంటి హీరోయిన్స్ బాలీవుడ్ లో గాని టాలీవుడ్ లో గాని చాలా అరుదుగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

కొంతమంది హీరోయిన్స్ సినిమాకి కమిటయ్యో ముందు సైన్ చేసినప్పటికి ఆ తర్వాత అంతకంటే పెద్ద బ్యానర్ నుండో, లేదా అంతకంటే పెద్ద హీరో సినిమాలోనో ఛాన్స్ వస్తే కమిటయిన సినిమాని క్షణల్లో ఒదిలేసి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతని నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోతున్నారు. దాని వల్ల నిర్మాతలకి గుండె ఆగినంత పని అవుతుంది. అప్పటికే సదురు హీరోయిన్ కమిటయిన సినిమా 50 శాతం 60 శాతం షూటింగ్ అయిపోతే గనక ఆ నిర్మాత పరిస్థితి వర్ణనాతీతం. దీని గురించి కంప్లైంట్స్ వగైరా వగైరా వ్యవహారాలతో ప్రాజెక్ట్ ఇరకాటంలో పడుతుంది. నెగిటివ్ పబ్లిసిటీతో ప్రాజెక్ట్ సర్వనాశనం అవుతుంది.

 

దాంతో కొమతమంది హీరోయిన్స్ అంటే నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే ఏ నిర్మాతైనా ఒక సినిమాకి హీరోయిన్ డేట్స్ తీసుకోవాలంటే పక్కాగా అన్ని జాగ్రత్తలు తీసుకొని కాస్త రిక్వెస్ట్ గా మాడం మధ్యలో ఇబ్బంది పెట్టరు కదా..ప్రజెక్ట్ వదిలేసి మిడిల్ డ్రాపవరు కదా అని అడుగుతున్నారట. ఇది విన్న కొందరి హీరోయిన్స్ కి నిర్మాతల మీద జాలేస్తుందని అంటున్నారు. ఒకళ్ళు ఇద్దరు చేసినప్పటికి కోట్లల్లో నష్టం వాటిల్లుతుంది కాబట్టి సినిమాకి సైన్ చేసే ముందు నిర్మాత ఖచ్చితంగా ఆ మట అడుగుతున్నారట. నిజమే కదా మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: