సీనియర్ నటులు సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ, తమ సినిమా జీవితంలో మొత్తం 350కి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. తేనె మనసులు సినిమాతో ప్రారంభమైన కృష్ణ జీవితం, ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ నటశేఖర గా సూపర్ స్టార్ గా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అందుకోవడంతో అత్యున్నత స్థాయికి చేరింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత రెండవ తరంలో కృష్ణ తిరుగులేని మాస్ సూపర్ స్టార్ గా ఎదిగి, ఎందరో అభిమానులను అలానే గొప్ప పేరును ఆర్జించారు. 

 

ఇక రోజులో అత్యధిక పనిగంటలు షూటింగ్ లోనే గడిపే కృష్ణకు, ఒక అలవాటు ఉందట. అది ఏమిటంటే, ఎక్కడ షూటింగ్ ఉన్నా దాదాపుగా అవకాశం ఉన్నంత వరకు అక్కడ నుండి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా విజయనిర్మల గారు చేతి భోజనం తినే వారట కృష్ణ. అందుకే అవకాశం ఉన్నంత వరకూ స్టూడియోలోనే షూటింగ్ ఏర్పాటు చేయడం, అలానే ఇంటి నుండి క్యారియర్ తప్పించుకోవటం లేదా వీలు దొరికితే ఇంటికి వెళ్లి భోజనం చేయటం చేసేవారట. ఎక్కువగా బయట ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, అది మాత్రమే కాక విజయనిర్మల చేతి వంట తనకు ఎంతో ఇష్టమని, అందువల్లనే వీలైనంతవరకూ ఇంటి భోజనాన్ని తీసుకుంటానని కృష్ణ ఎక్కువగా చెప్తూ ఉంటారు. 

 

ఇంత వయసు వచ్చినప్పటికీ నిత్యం రాగిజావ తాగటం, అలానే శరీరాన్ని, మనసును ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకుంటూ మంచి ఆహారాన్ని కనుక తీసుకుంటే, జీవితం ప్రశాంతంగా సాగుతుందని కృష్ణ అంటుంటారు. అయితే తన సహధర్మచారిణి విజయనిర్మల ఇటీవల అకాల మరణం తరువాత కృష్ణ మానసికంగా కొంత కృంగిపోయారని, ఆమె వెళ్లిపోవడంతో తనలో తానే ఎంతో మానసిక వేదన పడిన కృష్ణ, ఇప్పుడిప్పుడే మెల్లగా ఆ విషాద ఘటన నుండి బయటకు వస్తున్నారని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: