సూపర్ స్టార్ స్టామినా ఏంటో ఆయన ఎంచుకునే కథలు, తీసిన సినిమాలు చెబుతాయి. పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి మాస్ సినిమాలు తీసినా మహేష్ బయట చాలా సింపుల్ గా ఉంటారు. చాలా తక్కువ మాట్లాడతారు. డైరెక్టర్స్ కి విపరీతమైన గౌరవం ఇస్తారు. హీరోయిన్స్ అయితే ఆయన సింప్లిసిటీ కి పడి చచ్చిపోతారంతే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ..ఈ మధ్య మహేష్ వరుస బెట్టి క్లాస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. మహేష్ బాబు ని ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలలోనే చూడాలనుకుంటున్నారు.

 

ఇక మహేష్ ఒక కథ ని వినేటప్పుడు ఆ కథ తనకి నప్పుతుందా లేదా అని ఒకటి నాలుగు సార్లు ఆలోచిస్తారు. ఒకవేళ ఆ కథ ఆయన చేయాల్సిన కథే అయితే మాత్రం రెండవ ఆలోచన ఉండదు. డైరెక్టర్ తో ఒక్క మాటలో మనం సినిమా చేస్తున్నాం అని తేల్చేస్తారు. ఒకవేళ కథ నచ్చి ఆయనకి సెట్ అవదనిపించినా అదే మాట డైరెక్టర్ తో నిర్మొహమాటంగా చెప్పి అది ఏ హీరోకి సూటవుతుందో ఆయనే సలహా ఇస్తారు తప్ప ...ఆ కథ వేరే వాళ్ళు చేస్తే స్టార్ డం వస్తుందని మాత్రం జలసీతో కమిటవరు.

 

ఇక మహేష్  కి కథ చెప్పాలనుకున్న ఏ డైరెక్టర్ అయినా నాంచకుండా క్లారిటీగా, క్లియర్ కట్ గా నీట్ గా చెప్పాలి. ఆయన కథ వింటున్నప్పుడే ఏ ఏ సీన్స్ కి ఆడియిన్స్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా చెప్పేస్తారు. అయితే టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ మాత్రం మహేష్ అపాయింట్‌మెంట్ ని నానా అవస్థలు పడి సాధించి కథ చెప్పడానికి మహేష్ దగ్గరైకి వెళ్ళాడట. కథ చెప్పడం మొదలు పెట్టిన ఆ స్టార్ డైరెక్టర్ తిట్లతో మహేష్ కి కథ నరేట్ చేస్తున్నాడట.

 

ఆ తిట్లు భరించలేని మహేష్ వెంటనే ఆ డైరెక్టర్ ని ఛీ కొడుతూ నిర్మొహమాటంగా వెళ్ళి పొమ్మన్నాడట. ఎలాగైనా సూపర్ స్టార్ సినిమా తీయాలన్న ఆ స్టార్ డైరెక్టర్ కి నరాలు తెగినంత పనైందట. ఆ తర్వాత అదే కథ ని మరో స్టార్ హీరో తో తీస్తే భారీ ఫ్లాప్ అయింది. అన్నట్టు మహేష్ తో చేసిన హీరోయిన్ నే ఆ సినిమాలోను నటింపచేశాడు ఆ స్టార్ డైరెక్టర్. అంతేకాదు ఇప్పుడో సీనియర్ స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సీనియర్ హీరోకి గత కొంతకాలంగా భారీ ఫ్లాప్స్ పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: