టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. పాపం ఎన్నో సార్లు చెప్పాడు.. అతను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు అని.. అందుకే ఎక్కడిక్కడ బిజినెస్ లు పెంచుకుంటూ వస్తున్నారు మహేష్ బాబు. అలాంటి మహేష్ బాబుపై మొన్న ఓ వార్త సంచలనం రేపింది. ఆ వార్త ఏంటి అంటే ? మహేష్ బాబు సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి అనే వార్త. 

 

నిజానికి మహేష్ బాబు 2019 ఎన్నికలకు ముందు 'భరత్ అనే నేను' అంటూ.. సీఎం ఎలా పని చేస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అంటూ సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. అలాంటి సూపర్ హిట్ సినిమాను బేస్ చేసుకొనే ఓ యాంకర్ మహేష్ బాబుని ''మీరు రాజకీయాల్లోకి వస్తారా?'' అని అడిగిసింది.. అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ''నేను ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆరోజున రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి'' అంటూ చెప్పుకొచ్చారు మహేష్. 

 

అయితే 'ఈ ప్రశ్న.. మహేష్ బాబు' సమాధానం విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు.. వైసీపీ అభిమానులు మరి కొందరు.. ట్విట్టర్ వేధికగా వైసీపీలోకి మహేష్ బాబు అంటూ ట్విట్లు పెట్టేస్తున్నారు. అయితే.. నిజానికి వైసీపీలోకి మహేష్ బాబు వస్తున్నారు అని ప్రచారం జరగటం ఇప్పుడు కాదు.. 2013లోనే ప్రచారం జోరుగా సాగింది.. అప్పట్లో దూకుడు సినిమా క్రేజ్ ఉండే.. ఇంకా అప్పుడప్పుడే వైసీపీ పార్టీ తన పవర్ చూపించడం ప్రారంభించింది. 

 

ఇంకా ఆ సమయంలోనే మహేష్ బాబు వైసీపీలోకి అని ప్రచారం జరిగింది.. కానీ ఆ ప్రచారం జరిగి 7 ఏళ్ళు అవుతున్న.. మహేష్ బాబు వైసీపీలోకి వచ్చింది లేదు.. ఇక ఆ తర్వాత మళ్లీ కొద్దీ కాలానికి.. మహేష్ బాబు రాజకీయాల్లోకి రాబోతున్నారని, టీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల గురించి మాట్లాడిన మహేష్.. తన జీవితం సినిమాలకే అంకితం అని, రాజకీయాల్లో చేరే ఉద్దేశమే లేదని అన్నారు... అయినప్పటికీ మహేష్ బాబు ఫాన్స్ మహేష్ రాజకీయాల్లోకి రావాలని అని కోరుకుంటున్నారు.. మరి భవిష్యత్తులో ఏమైనా మహేష్ బాబు రాజకీయాల్లోకి వస్తారేమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: