త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ల సాన్నిహిత్యం గురించి పెద్దగా ఎవరు ఎవరికీ కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వీరిద్దరి ఆలోచనలు మనస్తత్వం ఒకలాగే ఉంటుంది అని వీరిద్దరినీ సన్నిహితంగా తెలిసిన వ్యక్తులు కామెంట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి పవన్ రీ ఎంట్రీ మూవీ ‘పింక్’ సబ్జెక్ట్ కు పవన్ ను ఒప్పించే విషయంలో దిల్ రాజ్ దూతగా త్రివిక్రమ్ రాయబారాలు పవన్ పై ఎంతో ప్రభావాన్ని చూపించాయి అన్న వార్తలు ఉన్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య త్రివిక్రమ్ పవన్ ను కలిసి ఒక స్టోరీ లైన్ ను వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న రెండు సినిమాలు పూర్తి అయిన తరువాత మైత్రీ మూవీస్ సంస్థకు ఒక సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయవలసి ఉంది. పవన్ రాజకీయాలలోకి రాకముందే మైత్రీ మూవీస్ పవన్ కు ఒక భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చింది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. 


ఇప్పుడు పవన్ వరసపెట్టి సినిమాలు చేస్తున్న నేపధ్యంలో మైత్రీ మూవీస్ సంస్థకు ఖచ్చితంగా సినిమాను చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో జూనియర్ త్రివిక్రమ్మూవీ వచ్చే ఏడాది మార్చిలోపు ప్రారంభం అయ్యే ఆస్కారం లేదు. దీనికితోడు కళ్యాణ్ రామ్ ఒత్తిడి తో జూనియర్ తన 30వ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా ఆ మూవీని వెట్రిమారన్ దర్శకత్వంలో చేసే విధంగా ఒక ప్రాధమిక అంగీకారం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. 


దీనితో జూనియర్ త్రివిక్రమ్మూవీ మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈ పరిస్థితులలో సుమారు ఏడాది పాటు ఖాళీగా ఉంటూ ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమాను చేసేకన్నా పవన్ తో తమ నాల్గవ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ ప్రాంతలో ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఇప్పుడు త్రివిక్రమ్ మనసులో ఉన్నాయి అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే పవన్ త్రివిక్రమ్మూవీ మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఉంటుందా లేకుంటే ఈ మూవీని హారికా హాసినీ తీస్తుందా అదే జరిగితే పవన్ కు వరసపెట్టి కథలు వినిపిస్తున్న హరీష్ శంకర్ పరిస్థితి ఏమిటి అన్న విషయాలు ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: