ఎక్కడో బాలీవుడ్ లో సీరియల్ హీరోయిన్ గా చేస్తూ ఉన్న పాయల్ రాజ్ పుత్ ను తెచ్చి తెలుగులో హాట్ హీరోయిన్ ను చేశాడు డైరక్టర్ అజయ్ భూపతి. ఆరెక్స్ 100 సినిమాతో అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్క సినిమాతోనే యూత్ ఆడియెన్స్ ను తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత కూడా క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది. మొదటి సినిమాతోనే క్లిక్ అయిన పాయల్ రాజ్ పుత్ తనకు వచ్చిన హాట్ ఇమేజ్ తో వరుస సినిమాలు చేస్తుంది. తన బోల్డ్ ఇమేజ్ కోసం ఓ పక్క యువ హీరోలతో ఆర్డిఎక్స్ లవ్ లాంటి సినిమాలు చేస్తూ సీనియర్ హీరో వెంకటేష్ తో వెంకీమామతో జోడీ కట్టింది ఈ అమ్మడు.

 

ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫోటో షూట్స్ చేయడం ప్రతి హీరోయిన్ కు కామన్ అయ్యింది. ఈ క్రమంలో లేటెస్ట్ గా పాయల్ రాజ్ పుత్ రెడ్ కలర్ కాస్టూం తో పాతకాలం హీరోయిన్ లా వయ్యారాలు పోతుంది. రెడ్ డ్రెస్ లో పాయల్ ను చూస్తే కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు షురూ అవడం ఖాయమని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే రాఘవేంద్ర రావు పెళ్లిసందడి సినిమాలో దీప్తి బట్నాగర్ ను చూసి శ్రీకాంత్ పాడినట్టుగా సౌందర్యలహరి స్వప్న సుందరి అని ప్రతి ఒక్కరు రాగం ఎత్తుకోవాల్సిందే.

   

తనకు వచ్చిన ఈ పాపులారిటీని ఇంకాస్త పెంచుకునే క్రమంలో ఇలా అడపాదడపా హాట్ ఫోటో షూట్స్ తో హంగమా చేస్తుంది పాయల్ రాజ్ పుత్. సినిమాలతో అలరించడమే కాకుండా ఇలా ఫోటో షూట్స్ తో కూడా తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరించడం హీరోయిన్స్ కు కామన్ అయ్యింది. వెంకీమామ హిట్ అయినా, డిస్కో రాజా ఫ్లాప్ అవడంతో కొద్దిగా డీలా పడిన పాయల్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: