ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తున్న వారిలో యువ హీరో శర్వానంద్ కూడా ఒకరని చెప్పొచ్చు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను హ్యాట్రిక్ ఫ్లాపులతో శర్వానంద్ కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. మూడు సినిమాల మీద విపరీతమైన బజ్ ఏర్పడింది. అయినా కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే ఈ సినిమాల ఫలితాల వల్ల శర్వానంద్ చాలా స్ట్రాంగ్ డెశిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. పడి పడి లేచే మనసు.. హను రాఘవపుడి డైరక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా చేసిన సినిమా లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించుకోగా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పడంతో సినిమా కూడా ట్రాక్ తప్పేసింది.  

 

ఇక సుధీర్ వర్మ డైరక్షన్ లో రణరంగం అంటూ శర్వానంద్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన జాను సినిమా బాగుందని అనిపించినా సరే వసూళ్లు బాగాలేదు. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 మూవీని తెలుగులో జానుగా తెరకెక్కించారు. శర్వానంద్, సమంత నటించిన ఈ సినిమా వీరిద్దరి నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి కాని సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో రాజన్న వల్లే ఈ సినిమా చేశానని పదే పదే చెప్పాడు శర్వానంద్. 

 

కొన్ని సినిమాల విషయాల్లో దిల్ రాజు ఆలోచనలు బాగా వర్క్ అవుట్ అవుతాయి. కాని జాను విషయంలో అది జరుగలేదు. కేవలం దిల్ రాజు చెప్పాడని మాత్రమే శర్వానంద్సినిమా చేశాడు. అయితే జాను రిజల్ట్ చూశాక ఇక మీదట ఎలాంటి మొహమాటాలకు పోయి సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడట శర్వా. అలా మొహమాటానికి పోతే తన కెరియర్ రిస్క్ లో పడుతుందన్న విషయం లేట్ గా తెలుసుకున్నాడు ఈ హీరో. జాను రిజల్ట్ పై డిజాప్పాయింట్ గా ఉన్న శర్వానంద్ తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: