బాలీవుడ్ బాద్షా ఆ తరం నుంచి ఈ తరం అమ్మాయిలు వరకు ఫిదా అయ్యే హీరో ఎవరంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బాలీవుడ్ బాద్షాగా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్. ఇక ఈ మధ్య కాలంలో ఆయన నటించిన ‘జీరో’ చిత్రం తరువాత షారుఖ్ మాట వినిపించటం లేదు. దాదాపుగా ఏడాదిన్నరగా ప్రాజెక్టు ఇదిగో అదిగో అన్న అలికిడి తప్ప, అసలు విషయం బయటకు రావడంలేదు. లాంగ్ గ్యాప్ తరువాత బాలీవుడ్లో మళ్లీ షారుఖ్ ‘విజిల్’ వినిపిస్తోంది. వరుస ఫ్లాపులతో ‘జీరో’ అయిపోయిన షారుఖ్‌ని -లేపి నిలబెట్టే బాధ్యతను తమిళ దర్శకుడు అట్లీ తీసుకున్నట్టు తెలుస్తోంది.
సౌత్ డైరెక్టర్‌గా వరుసపెట్టి నాలుగు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు అట్లీ. అట్లీతో షారుఖ్ ప్రాజెక్టు ఉంటుందంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. విజయ్‌తో ‘బిగిల్’ హిట్టుకొట్టిన అట్లీ, ఆ తరువాత ఏ స్టార్ హీరోనూ అప్రోచ్ కాకపోవడం కథనం నిజమే అయివుంటుందన్న అంచనాలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం అట్లీ స్క్రిప్ట్‌ను షారుఖ్ ఓకే చేశాడట.
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిపి సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్‌పై ప్రాజెక్టు తెరకెక్కొచ్చని, వచ్చే వేసవిలో ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్లొచ్చన్న టాక్ వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన అంశమేమంటే ఈ ప్రాజెక్టులో తమిళ స్టార్ విజయ్ ఓ కామియో రోల్ చేయనున్నాడని. ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయితే, కెరీర్ గ్రాఫ్‌లో కిందపడిన షారుఖ్ పైకి లేస్తాడేమో చూడాలి. అల్ ది బెస్ట్ షారుఖ్ !? తమిళ్ లో బిగిల్ హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా అట్లీ దర్శకత్వం బాలీవుడ్వాళ్ళకి నచ్చుతుంది. ఇక అట్లీ విషయానికి వస్తే ఒకేసారి బాలీవుడ్ ఛాన్స్ కొట్టినందుకు గ్రేట్ అనే చెప్పాలి. మరి షారుఖ్ యువ దర్శకుడైన అట్లీలో ఏం నచ్చి వెంటనే ఓకే చేశాడో చూడాలి. ఇంత పెద్ద ఛాన్స్ దొరికినందుకు అట్లీ జాగ్రత్తగా చేయాలి. అలాగే షారుఖ్‌కి కూడా ఈ చిత్రం చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఇది కనుక హిట్ కొడితే కొంచం మళ్ళీ సెట్ అయ్యాడు అని అనుకుంటారు. లేదంటే ఇంక గాడి తప్పినట్లే అని అందరూ ఫిక్స్ అయిపోతారు.