‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ లో విజయ్ దేవరకొండ రష్మికల లవ్ కెమిస్ట్రీ ఎంతో కీలకంగా ఆ మూవీ ఘన విజయానికి సహాయపడింది. దీనికితోడు వీరిద్దరూ వెంటనే ‘డియర్ కామ్రేడ్’ మూవీలో మళ్ళీ కలిసి నటించడంతో పాటు వీరిద్దరి మధ్య లిప్ లాక్ సీన్స్ చాల ఘాటుగా ఉండటంతో వీరిద్దరి మధ్య బయటపడని ఏదో సాన్నిహిత్యం ఉంది అంటూ అనేక ప్రచారాలు జరిగాయి.


ఈ గాసిప్పులు తట్టుకోలేక వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించే ఆలోచనలు విరమించుకున్నా వీరి సాన్నిహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ వార్తల నుండి రష్మిక విజయ్ ని చాల తెలివిగా తప్పించింది. మరో రెండు రోజులలో విడుదలకాబోతున్న ‘భీష్మ’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తమిళ హీరో విజయ్ పై తనకు ఉన్న క్రష్ ను బయటపెట్టింది. 


ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోలు అందరిలోనూ ఎవరి పై క్రష్ ఉంది అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు చిన్నప్పటి నుండి తమిళ హీరో విజయ్ అంటే విపరీతమైన వ్యామోహం అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు అట్లీ దర్శకత్వంలో తనకు తమిళ హీరో విజయ్ తో నటించే అవకాసం రాలేదని అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది. 


ప్రస్తుతం తమిళ హీరో కార్తీతో తాను నటిస్తున్న విషయాన్ని వివరిస్తూ తనకు తమిళనాడు నుంచి కూడ మంచి ఆఫర్స్ వస్తున్న విషయాన్ని బయటపెట్టింది. దీనితో విజయ్ దేవరకొండ కేవలం తనతో నటించే అనేకమంది హీరోలు లా ఒక సహ హీరో మాత్రమే అనీ తమ మధ్య ఏబంధం లేదనీ తెలివిగా రాష్మిక క్లారిటీ ఇచ్చింది అంటూ ఈ ఇంటర్వ్యూ విన్నవారు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఇప్పటికే పరాజయాల బాటలో నడుస్తున్న తన ప్రియ మిత్రుడు విజయ్ దేవరకొండను రష్మిక తన తెలివి తేటలతో తప్పించింది అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: