టాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్వయం శక్తితో హీరోగా పరిచయం అయి సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు మెగా స్టార్‌ చిరంజీవి. తన కెరీర్లో ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన చిరంజీవి కొన్ని దారుణమైన సినిమాలు చేశాడు. మోహమాటానికో లేక తన ఇమేజ్‌కు ఆ సినిమాలు ప్లస్ అవుతాయనుకున్నాడో గాని మెగాస్టార్ చేసిన కొన్ని పొరపాట్లు దారుణంగా దెబ్బేశాయి. అలాంటి కొన్ని సినిమాలు గురించి ఇక్కడ చూద్దాం.

 

మెగాస్టార్ కెరీర్లో దారుణంగా నిరాశపరిచిన సినిమా లంకేశ్వరుడు. మెగాస్టార్‌ మాస్‌ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న తరుణంలో అప్పటి స్టార్‌ దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన సినిమా లంకేశ్వరుడు. చిరులోని మాస్‌ యాంగిల్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడింది. ఈ సినిమా చిరును ఏ రేంజ్‌లో భయపెట్టిందంటే తరువాత చిరు, దాసరితో ఇక సినిమా చేయకూడదనే స్థాయిలో షాక్‌ ఇచ్చింది.

 

కథా కథనాలు పరవాలేదనిపించిన కొన్ని సార్లు ఆడియన్స్‌ కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు. అలాంటి సినిమానే మెకానిక్‌ అల్లుడు. మెగాస్టార్‌ చిరంజీవి, లెజెండరీ యాక్టర్‌ అక్కినేని నాగేశ్వరావు కలిసి నటించిన ఈ సినిమా కూడా నిరాశపరిచింది. కథా పరంగా పరవాలేదనిపించినా కథనంలో చేసిన పోరపాట్లు మెగాకానిక్‌ అల్లుడుని హిట్ కాకుండా అట్టుకుంది.

 

చిరు కెరీర్‌లో ఓ మచ్చలా మిగిలిపోయిన సినిమా అల్లుడా మజాకా. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దారుణమైన అడల్ట్‌ కంటెంట్ ఉందంటూ విమర్శలు వచ్చాయి. సినిమాలో కంటెంట్‌ కూడా  గజిబిజీగా ఉండటంత, రిలీజ్ తరువాత సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవ్వటంతో అల్లుడా మజాకా డిజాస్టర్‌ల లిస్ట్‌లో చేరిపోయింది. అదే స్థాయిలో చిరుకు చెడ్డపేరు తెచ్చిన మరో సినిమా బిగ్‌ బాస్‌. ఈ సినిమాలో అర్థం కానీ కథా కథనాలు చిరు కెరీర్‌కు మరో స్పీడు బ్రేకర్‌లా మారాయి.

 

చిరు కెరీర్‌లో మరో చేదు అనుభవం మృగరాజు. తనకు చూడలని ఉంది లాంటి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన గుణశేఖర్‌ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు చిరు. అదే మృగరాజు. ఓ గంటన్నర హాలీవుడ్‌ సినిమాను మూడు గంటల తెలుగు సినిమాగా తెరకెక్కించటంతో ఫెయిల్‌ అయిన దర్శకుడు చిరంజీకి మరో భారీ డిజాస్టర్‌ను అందించాడు. ఇవే కాదు శంకర్‌ దాదా జిందాబాద్‌, ఎస్పీ పరశురాం, మెకానిక్‌ అల్లుడు, యుద్ధభూమి, ఆరాధన లాంటి అట్టర్‌ ఫ్లాప్ సినిమాలు చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: